ఎన్టీఆర్‌ పెద్ద స్కెచ్చే వేసాడండోయ్‌

ఎన్టీఆర్‌ పెద్ద స్కెచ్చే వేసాడండోయ్‌

నందమూరి అభిమానుల్లో వచ్చిన విబేధాలు ఎన్టీఆర్‌ సినిమాలపై కొంత కాలంగా ప్రభావం చూపిస్తున్నాయి. అతని సినిమాలు బాగున్నాయనే టాక్‌ వచ్చినా కానీ కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ సినిమాలు సరిగా ఆడడం లేదు. దీనికి అభిమానుల్లో ఒక వర్గం నుంచి వస్తోన్న నిరాదరణే కారణమని తెలుస్తోంది. బాలయ్య, చంద్రబాబుతో హరికృష్ణ ఫ్యామిలీ విబేధించడంతో నందమూరి అభిమానులు తారక్‌కి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం లేదు. అభిమానుల్తో కొంత కాలంగా ఇంటరాక్షన్‌ కూడా తగ్గించిన ఎన్టీఆర్‌ ఇప్పుడు అభిమానులకి చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. ఈమధ్యే తన పీఆర్‌ టీమ్‌ని పటిష్టం చేసిన తారక్‌, ఇప్పుడు అభిమానులని తరచుగా కలుసుకోవడానికి ఏర్పాట్లు చేయించాడు.

సినిమా రిలీజయ్యాక ఏదో ఒకరిద్దరు అభిమానుల్ని కలిసే అలవాటున్న తారక్‌ ఇప్పుడు షూటింగ్‌ స్పాట్లో కూడా ఫాన్స్‌ని కలిసి వారితో ఫోటోలు దిగుతున్నాడు. దీని కోసం అతను రోజూ కొద్ది సమయం కేటాయిస్తున్నాడు. ఇది తెలుసుకున్న నందమూరి అభిమానులు మళ్లీ ఎన్టీఆర్‌కి చేరువ అవుతున్నారు. ఎలాగైనా 'బుడ్డోడి'ని కలుసుకోవాలంటూ బారులు తీరుతున్నారు. గతంలో ఇలా తరచుగా ఫాన్స్‌ని కలుసుకుని తన ఫాన్‌ బేస్‌ని మరింత పెంచడానికి చిరంజీవి నిత్యం తపించేవారు. షూటింగ్‌ అయిపోయాక కూడా ఫాన్స్‌ కోసం గంట సమయం కేటాయించి అందరితో ఫోటోలు దిగేవారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా చిరంజీవిని ఫాలో అయిపోతూ ఫాన్స్‌ మనసులు దోచేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు