కొణిదెల నీహారిక తిప్పలు అన్నీ ఇన్నీ కావు

కొణిదెల నీహారిక తిప్పలు అన్నీ ఇన్నీ కావు

మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న తొలి హీరోయిన్‌ నీహారిక కొణిదెలకి తన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లా భారీ లాంఛ్‌ దొరకలేదు. పెద్ద దర్శకుడు, పెద్ద నిర్మాత దొరక్కపోవడంతో నీహారిక తనకి వచ్చిన ప్రాజెక్ట్‌నే ఓకే చేసింది. అయితే దీని వల్ల పాపం నీహారికకి చచ్చే చిక్కొచ్చి పడింది. తన మొదటి సినిమాకి హైప్‌ తీసుకురావడానికి ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. ఇందులో హీరోగా నటించిన నాగశౌర్య కూడా పెద్ద క్రౌడ్‌ పుల్లరేమీ కాదు. అతని సినిమా బాగుందనే టాక్‌ వస్తే చూస్తారు తప్ప అది చూడాలంటూ జనం ఎదురు చూడరు.

ఆడియో వేడుకకి యువ మెగా హీరోలందరినీ పిలిచి 'ఒక మనసు' ఆడియో లాంఛ్‌ బ్రహ్మాండంగా చేసినా, దానికి అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్‌ ఆ ఫంక్షన్‌ని సైడ్‌ ట్రాక్‌ పట్టించేసాడు. పవన్‌కళ్యాణ్‌ గురించి తాను చేసిన 'చెప్పను బ్రదర్‌' కామెంట్స్‌కి వివరణ ఇచ్చుకుని 'ఒక మనసు' ఆడియో కంటే తనే హైలైట్‌ అయ్యేట్టు చేసాడు. వచ్చే వారం విడుదలకి సిద్ధమవుతోన్న 'ఒక మనసు'పై ఎక్కడా బజ్‌ లేదు. మొదటి సినిమా ఎలాగైనా హిట్‌ అవ్వాలంటూ నీహారిక వన్‌ ఉమన్‌ ఆర్మీగా మారి తన చిత్రాన్ని తానే ప్రమోట్‌ చేసుకోవడానికి చాలా పాట్లు పడుతోంది. ఇంత చేస్తున్నందుకైనా తన కష్టాన్ని గుర్తించి 'ఒక మనసు'ని పెద్ద మనసుతో ఆదరిస్తారో లేదో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు