‘జెంటిల్‌మన్’ ఆడకపోయినా నా మాట అదే-నాని

‘జెంటిల్‌మన్’ ఆడకపోయినా నా మాట అదే-నాని

‘భలే భలే మగాడివోయ్’.. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’.. సినిమాల తర్వాత నాని వీటికంటే పెద్ద స్థాయిలో, ఫామ్‌లో ఉన్న పెద్ద దర్శకుడితో సినిమా చేస్తాడని అనుకున్నారు చాలామంది. కానీ నాని మాత్రం ‘బందిపోటు’ లాంటి డిజాస్టర్ తీసిన, కెరీర్లో పెద్ద కమర్షియల్ సక్సెస్‌లు లేని ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘జెంటిల్‌మన్’ చేశాడు. ఐతే ఇంద్రగంటి తనకు హీరోగా లైఫ్ ఇచ్చాడనో.. మరో కారణంతోనో ఈ సినిమా చేయలేదని.. కేవలం కథను నమ్మాను కాబట్టి ‘జెంటిల్‌మన్’ అంగీకరించానని చెప్పాడు నాని. తాను ఓ కథను నమ్మి సినిమా చేశానంటే అది ఫ్లాప్ అయినా పర్వాలేదు కానీ.. తాను నమ్మని కథతో మాత్రం ఎప్పుడూ సినిమా చేయనని స్పష్టం చేశాడు నాని.

‘‘భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాల తరువాత కొంతమంది మిత్రులు ఇకపై కమర్షియల్ సినిమాలు చేయాలంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు. నేను ప్రయోగాలు చేయడం వాళ్లకు నచ్చలేదు. అందుకే వాళ్లు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు కూడా తీసుకొచ్చారు. కానీ నేను మాత్రం నేను నమ్మిన సబ్జెక్టుతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. జెంటిల్ మన్ సినిమా అంగీకరించినపుడు కొంత మంది మిత్రులు వద్దన్నారు. నిజంగానే వాళ్లు అనుకున్నట్టుగా ఈ సినిమా సక్సెస్ కాకపోవచ్చేమో. అయినా నా అభిప్రాయం మారదు. కానీ నేను మాత్రం నమ్మిన సినిమా చేశాననే సంతృఫ్తి పొందుతా. అంతేకానీ నేను నమ్మని కథతో సినిమా చేసి ఇబ్బంది పడలేను’’ అని నాని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు