బీరు బాటిల్ 60 రూపాయలేంటి త్రివిక్రమ్

బీరు బాటిల్ 60 రూపాయలేంటి త్రివిక్రమ్

త్రివిక్రమ్ అసలు మద్యమే ముట్టడో ఏంటో తెలియదు కానీ.. ఆయన నిన్న ‘అఆ’ విజయోత్సవంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించాయి. త్రివిక్రమ్ ప్రకారం బీరు బాటిల్ 60 రూపాయలకే వస్తోందట. మార్కెట్లో ధరలు ఎలా మండిపోతున్నాయో త్రివిక్రమ్‌కు అస్సలు అవగాహన లేదని ఈ మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇంతకీ త్రివిక్రమ్ నోట ఈ బీరు మాట ఎందుకొచ్చిందీ అంటే..

‘అఆ’ సినిమా గురించి చెబుతూ ప్రపంచం పోకడ గురించి ఆవేదన వ్యక్తం చేశాడు త్రివిక్రమ్. మనుషులు మాట్లాడుకోవడమే తగ్గిపోతోందని.. అందరూ చెడు మార్గానే పయనిస్తున్నారని అన్నాడు త్రివిక్రమ్. మంచి గాలి పీలిస్తే 98 శాతం జబ్బులు రావని.. ఐతే జనాలు ఉచితంగా దొరికే స్వచ్ఛమైన గాలి పీల్చడం మానేసి.. డబ్బులు పెట్టి సిగరెట్ కొని ఆ గాలి పీలుస్తున్నారని అన్నాడు. పది రూపాయలు పెట్టి మంచి నీళ్లు కూడా కొనరని.. ఐతే 60 రూపాయలు పెట్టి బీరు బాటిల్ కొని తాగి పాడైపోతారని వ్యాఖ్యానించాడతను.

ఐతే త్రివిక్రమ్ చెబుతున్న రేట్లు మార్కెట్లో ఎక్కడా లేవు. మంచి నీళ్ల బాటిల్ 20 రూపాయలైతే.. బీరు బాటిల్ 120 పలుకుతోంది. ఏదో మాట వరసకు ఈ మాటలు అనేశాడంటే కుదరదు. డైరెక్టర్ అన్నాక గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో.. రియాలిటీ ఏంటో తెలియాలి. రేప్పొద్దున తన సినిమాల్లో కూడా ఇలాగే చూపిస్తే కష్టం కదా. కాబట్టి ఒకసారి త్రివిక్రమ్ స్వయంగా షాపింగ్ ప్లాన్ చేస్తే బెటరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు