మామ కష్టం.. అల్లుడు వృథా..

మామ కష్టం.. అల్లుడు వృథా..

ఒక్కోసారి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కొందరు హీరోల్ని చూస్తుంటే అర్థమైపోతుంది. ఇంకొందరికేమో గాడ్ ఫాదర్ ఉండి.. బ్యాగ్రౌండ్ లో తోస్తూ ఉన్నా కూడా దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. సందీప్ కిషన్ కూడా ఇందులో ఒకడే. మామయ్య ఛోటా కే నాయుడు పుణ్యమా అని ఇన్నాళ్లూ సరైన హిట్లు లేకపోయినా సందీప్ బండి సాఫీగా నడుస్తూనే ఉంది. ప్రతీ సినిమాకు అల్లుడి కోసం చేయాల్సిన త్యాగాలన్నీ చేస్తున్నాడు చోటా. కానీ అల్లుడే సరిగ్గా స్పందించట్లేదు.

అప్పుడెప్పుడో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత ఇప్పటి వరకు కనీసం ఓ సూపర్ హిట్ కూడా తీసుకురాలేకపోయాడు సందీప్ కిషన్. బీరువా, టైగర్ ఓకే అనిపించుకున్నా సూపర్ హిట్లు కాలేకపోయాయి. తాజాగా ఈ హీరో నటించిన ఒక్క అమ్మాయి తప్ప విడుదలైంది. సినిమాకు ముందు ఇలాంటి సినిమాలో నటించడం నా అదృష్టం అంటూ పెద్దపెద్ద డైలాగులు చెప్పాడు సందీప్. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం అంత విషయం లేదంటున్నారు. అక్కడక్కడా ఏవో మెరుపులు తప్పితే సినిమా అంతా సోదే అంటున్నారు. హిందీలో వచ్చిన ది వెన్నెస్ డే ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. సినిమాలో 80 శాతం ఫ్లై ఓవర్ పైనే నడవడం.. కామెడీ సీన్లు లేకపోవడం వంటివి ఒక్క అమ్మాయి తప్పకు మైనస్ గా మారాయి. మొత్తానికి హిట్ కొట్టాలన్న సందీప్ కలను అమ్మాయి కూడా తీర్చలేకపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు