పటాస్.. సుప్రీమ్.. తర్వాత ఏంటి?

పటాస్.. సుప్రీమ్.. తర్వాత ఏంటి?

గత ఏడాది అనిల్ రావిపూడి పేల్చిన ‘పటాస్’ దెబ్బకు టాలీవుడ్ షేకైపోయింది. కళ్యాణ్ రామ్ లాంటి ఫ్లాప్ హీరో ఓ కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా మీద విడుదలకు ముందు ఎలాంటి అంచనాల్లేవు. కానీ తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని అదిరిపోయే వసూళ్లు సాధించిందీ సినిమా. కమర్షియల్ సినిమాలు తీయడంలో అనిల్ ప్రతిభ గమనించి.. వెంటనే తన బేనర్లో ఛాన్సిచ్చాడు దిల్ రాజు. తొలి సినిమాతో హిట్టు కొట్టిన దర్శకులు..చాలా వరకు రెండో సినిమాతో బోల్తా కొడుతుంటారు. కానీ అనిల్ మాత్రం సెంటిమెంటు దెబ్బ తినలేదు. ‘సుప్రీమ్’తో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తో మొదలై సూపర్ హిట్ రేంజికి చేరుకుంది.

ఇక అనిల్ మూడో సినిమా ఏదా అని ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతను ఎనర్జిటిక్ హీరో రామ్ తో తన తర్వాతి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. తొలి సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా రెండో సినిమా చేసేసిన అనిల్.. మూడో సినిమాకు కూడా మరీ ఎక్కువ టైమేమీ తీసుకోవట్లేదు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తున్న రామ్ మూడు నెలల్లో ఖాళీ అయిపోతాడు. ఆలోపు అనిల్ స్క్రిప్టు రెడీ చేసి.. సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారో ఇంకా ఖరారవ్వలేదు. బహుశా రామ్ బాబాయి స్రవంతి రవికిషోరే ప్రొడ్యూస్ చేయొచ్చని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు