సందీప్‌కు డబ్బులిస్తారు.. కండిషన్స్ అప్లై

సందీప్‌కు డబ్బులిస్తారు.. కండిషన్స్ అప్లై

అసలు సినిమాకు రెమ్యూనరేషనే తీసుకోకపోవడం వేరు.. ముందు సినిమా పూర్తి చేసి విడుదలై నిర్మాత చేతికి డబ్బులొచ్చాక పారితోషకం అందుకోవడం వేరు. ఐతే యువ కథానాయకుడు సందీప్ కిషన్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాకు అతను పైసా పారితోషకం తీసుకోకుండా త్యాగం చేశాడని.. సరైన సక్సెస్‌లు లేకపోవడం వల్లే సందీప్‌కు ఈ పరిస్థితి వచ్చిందని.. ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు జనాలు. ఐతే తాను రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం అంటూ ఏమీ లేదని.. నిర్మాత దగ్గర బడ్జెట్ లేకపోవడంతో సినిమా రిలీజై బాగా ఆడాక తీసుకుందామని నిర్ణయించుకున్నానని సందీప్ వెల్లడించాడు.

‘‘ఒక్క అమ్మాయి తప్ప సెట్స్ మీదికి తేవడానికి చాలా కష్టమైంది. అందరూ స్క్రిప్టు బాగుందనే వాళ్లే. కానీ ఈ సినిమా తీయడానికి అవసరమైన లాజిస్టిక్స్ గురించి చెబితేనే ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ఓ నిర్మాత దొరికాడు. కానీ ఉన్న బడ్జెట్ తక్కువ. అలాంటపుడు ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి. త్యాగం చేయాలి. అది నేనే చేశాను. సినిమా రిలీజై బాగా ఆడితేనే పారితోషకం తీసుకుంటానని నిర్మాతకు చెప్పాను. అప్పుడే సినిమా ముందుకు కదిలింది. ఓ మంచి సినిమాకు ప్రోత్సాహంగా ఇదంతా చేశాను. కచ్చితంగా మేం పెట్టుకున్న నమ్మకం ఫలిస్తుంది. ఒక్క అమ్మాయి తప్ప ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’’ అని సందీప్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు