సందీప్ ఆశల్ని తొక్కేస్తోన్న నిత్యామీనన్..

సందీప్ ఆశల్ని తొక్కేస్తోన్న నిత్యామీనన్..

ఈ మధ్య ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువైపోయాయి. అంటే అందులో హీరో ఉండడని కాదు.. ఉంటాడు జస్ట్ ఉంటాడంతే. మొన్న వచ్చిన అ.. ఆ సినిమానే తీసుకోండి. అందులో నితిన్ హీరో. కానీ పేరంతా సమంత పట్టుకెళ్లిపోతోంది. ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప సినిమా విషయంలో కూడా నిత్యామీనన్ హైలైట్ అవుతోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో అయినా.. అందరి చూపు నిత్యామీనన్ పైనే ఉంది. ఈమె కథలో కంటెంట్ బలంగా ఉండి.. తన పాత్ర నచ్చితే గానీ ఏ సినిమా ఒప్పుకోదు. అలాంటిది సందీప్ తో నటించడానికి ఒప్పుకుందంటే అమ్మాయిలో ఏదో విషయంలో ఉండే ఉంటుంది.

ఒక్క అమ్మాయి తప్పకు నిత్యామీనన్ క్రేజ్ బాగా ఉపయోగపడనుంది. రిలీజ్ ఇంకా రెండ్రోజులే టైమ్ ఉండగా.. ఇప్పటి వరకు నిత్యామీనన్ ప్రమోషన్ కు రావట్లేదు.. రాలేదు కూడా. ఇదే సినిమా యూనిట్ ను కంగారు పెడుతోంది. మెయిన్ పిల్లర్ లేకుండా ప్రమోషన్ ఏంటా అని కంగారు పడుతున్నాడు సందీప్ కిషన్. తాను ఎంత ప్రమోట్ చేసినా.. నిత్యా కూడా ఉంటే అదిరిపోయేదని భావిస్తున్నాడు ఈ కుర్ర హీరో. మరోవైపు ఒక్క అమ్మాయి తప్ప సందీప్ కెరీర్ కు చాలా కీలకం. అసలే ఫ్లాపుల జడిలో ఉన్న సందీప్ ను అమ్మాయి కరుణించకపోతే చాలా సమస్యలు వచ్చేస్తాయి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు