స‌ర్కార్ చేతికి సాక్షి మీడియా

స‌ర్కార్ చేతికి సాక్షి మీడియా

వైకాపా అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అతి పెద్ద బ‌లం ఏంటి అని లెక్కలేసుకుంటే వైకాపానో, ఆయ‌న సామాజిక‌వ‌ర్గ‌మో, ఆయ‌న పార్టీకి ఉన్న ప్ర‌జా ప్ర‌తినిధులో, కార్య‌క‌ర్త‌లో అన్న స‌మాధానాలే చాలా మంది ఇస్తారు. కానీ జ‌గ‌న్‌కు ఇప్పుడు ఇవ‌న్నీ మైన‌స్‌గానే ఉన్నాయి. ఆయ‌న‌కు ఫుల్ ఎనర్జీ ఏటంటే సాక్షి మీడియా. జ‌గ‌న్, వైకాపా వాయిస్ చాలా బ‌లంగా వినిపించేందుకు, ప్ర‌భుత్వ పనితీరును, టీడీపీని టార్గెట్‌గా చేసుకుని విరుచుకుప‌డేందుకు సాక్షి ప‌త్రిక‌, సాక్షి ఛానెల్ జ‌గ‌న్‌కు కుడిభుజంగా ఉంటున్నాయి.

 మీడియా అంటేనే తిమ్మిని బ‌మ్మి చేసేస్తుంది. ఇక జ‌గ‌న్ సొంత మీడియా కావ‌డంతో సాక్షి ప‌త్రిక‌, ఛానెల్ జ‌గ‌న్ ఎలా అనుకూలంగా ఉంటాయో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్‌గా ఉంటున్న ఈ సాక్షి ఇప్పుడు జ‌గ‌న్‌కు పెద్ద షాక్ ఇవ్వ‌నుంది. సాక్షి జ‌గ‌న్‌కు ఎలా షాక్ ఇస్తుంద‌నుకుంటున్నారా... సాక్షి ప‌త్రిక, సాక్షి ఛానెల్ ఆస్తుల‌ను ప్ర‌భుత్వ స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధ‌మైంది. అక్ర‌మ ఆస్తుల కేసుల్లో అటాచ్డ్ సొమ్మును ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో ఏపీ స‌ర్కార్ సాక్షిని స్వాధీనం చేసుకోనుంది.

 రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ పై 11 చార్జిషీటులున్న‌ నేపథ్యంలో సీబీఐ, ఈడీ జగతి పబ్లికేషన్స్ తో పాటు జగన్‌కు చెందిన మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. నిబంధ‌న‌ల ప్ర‌కారం అక్ర‌మ ఆస్తుల కేసుల్లో అటాచ్డ్ ఆస్తుల‌ను ప్ర‌త్యేక కోర్టుల ద్వారానే స్వాధీనం చేసుకోవాలి. ఏపీ స‌ర్కార్ ప్ర‌త్యేక కోర్టుల ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర హోం శాఖ‌కు పంప‌డం...దానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదముద్ర వేయ‌డంతో ఆస్తుల స్వాధీన ప్ర‌క్రియ స్టార్ట్ చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఇదే విష‌యాన్ని ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా చెప్పారు. సాక్షి ఆస్తుల స్వాధీన ప్ర‌క్రియ మ‌రో రెండు మూడు రోజుల్లో ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

  ఏదేమైనా ప్ర‌స్తుతం ఏపీ స‌ర్కార్ దూకుడు చూస్తుంటే కొద్ది రోజుల్లోనే సాక్షి ఆస్తుల స్వాధీన ప్ర‌క్రియ ప్రారంభంకానుంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే జ‌గ‌న్‌కు పెద్ద బ‌లంగా ఉన్న మీడియా ప్ర‌భుత్వం చేతుల్లోకి వ‌స్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మీడియా సంస్థ‌లు అధికార టీడీపీకి స‌పోర్ట్‌గా నిలుస్తున్నాయ‌న్న టాక్ ఉంది. ఇక జ‌గ‌న్‌కు ఉన్న ఒకే ఒక అస్ర్తం సాక్షి కూడా చేజారితో ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ వాయిస్ ప్ర‌జ‌ల‌కు చేర‌డం క‌ష్ట‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు