బాలయ్య డైరెక్టర్ ఎన్నాళ్లకెన్నాళ్లకు

బాలయ్య డైరెక్టర్ ఎన్నాళ్లకెన్నాళ్లకు

పరుచూరి మురళి.. ఈ పేరు గుర్తుందా..? ఎం.ఎస్.రాజు నిర్మాతగా టాప్ ఫామ్‌లో ఉన్న టైంలో తీసిన 'నీ స్నేహం' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడీ దర్శకుడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. అవకాశాలకేం లోటు లేకపోయింది. జగపతిబాబుతో చేసిన 'పెదబాబు'.. గోపీచంద్ హీరోగా చేసిన 'ఆంధ్రుడు' పరుచూరి మురళిని నిలదొక్కుకునేలా చేశాయి. కానీ ఈ కన్సిస్టెన్సీని తర్వాత మెయింటైన్ చేయలేకపోయాడు మురళి. నితిన్‌తో అతను తీసిన 'రెచ్చిపో' పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మురళి.. అనూహ్యంగా నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమానే.. అధినాయకుడు.

మంచి అంచనాల మధ్య రిలీజైన 'అధినాయకుడు' బాలయ్య కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్ అయింది. తన ట్రాక్ రికార్డు చూడకుండా తన మీద బాలయ్య పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టలేకపోయిన మురళి.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. ఈ సినిమా వచ్చి నాలుగేళ్లవుతోంది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ పరుచూరి మురళి పేరు వినిపిస్తోంది టాలీవుడ్లో. మురళి కెరీర్లో బెస్ట్ మూవీ అనదగ్గ 'ఆంధ్రుడు'లో హీరోగా నటించిన గోపీచంద్ హీరోగా మురళి తన తర్వాతి సినిమా చేయబోతున్నాడట. గోపీచంద్‌కు హోం బేనర్లాంటి 'భవ్య క్రియేషన్స్' ఈ చిత్రాన్ని నిర్మిస్తుందట. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్లు ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథను రెడీ చేస్తున్నాడట మురళి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. గోపీ ప్రస్తుతం ఎ.ఎం.రత్నం బేనర్లో ఆయన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వంలో 'ఆక్సిజన్' అనే సినిమా చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు