ధ్రువ రిలీజ్ డేట్ ఇదే.. ఫిక్సయిపోండి

ధ్రువ రిలీజ్ డేట్ ఇదే.. ఫిక్సయిపోండి

ఒక సినిమా రిలీజ్ డేట్ ఇచ్చి దాన్ని పోస్ట్ పోన్ చేయడమే తప్ప.. ప్రిపోన్ చేయడం అన్నది ఏ ఇండస్ట్రీలో అయినా అరుదైన విషయమే. ఐతే రామ్ చరణ్ సినిమా ‘ధ్రువ’ను విడుదల తేదీని మాత్రం ముందుకు తెస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమాను అక్టోబరు రెండో వారానికి రిలీజ్ చేయాలి.

ఐతే రామ్ చరణ్‌కు అక్టోబరు సెంటిమెంటు కలిసి రాదన్న ప్రచారం మరీ గట్టిగా జరిగే సరికి అల్లు అరవింద్ అప్రమత్తం అయ్యాడో ఏంటో తెలియదు కానీ.. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 30నే విడుదల చేయాలని ఫిక్సయ్యారు. అక్టోబరు 11న దసరా రానున్న నేపథ్యంలో పండక్కి వారం రోజుల ముందే సెలవులు మొదలవుతాయి. ఆ ముందు వీకెండ్లోనే సినిమాను రిలీజ్ చేస్తే రెండో వారమంతా సెలవుల్లో కలెక్షన్ల పంట పండించుకోవచ్చని అరవింద్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఐతే రెండో వారం కూడా అదరగొట్టాలి అంటే ముందు సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి. ఇది తమిళ బ్లాక్‌బస్టర్ ‘తనీ ఒరువన్’కు రీమేక్ కాబట్టి సినిమా కచ్చితంగా ఆడుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు అరవింద్. నిజానికి ‘ధ్రువ’ను ఆగస్టులోనే రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా ఉండేది. కానీ తన చెల్లెల్లి పెళ్లి పనులు, తండ్రి 150వ సినిమాకు సంబంధించిన హడావుడిలో పడి రామ్ చరణ్ చాలా లేటుగా షూటింగ్‌కి రావడంతో లేటుగా రిలీజ్ చేయాల్సి వస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్‌గా చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు