నయనతార మీద కన్నేశారు

నయనతార మీద కన్నేశారు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఎవరిని తీసుకున్నా కానీ ఇప్పుడు అయిదు కోట్లకి పైగానే పారితోషికం ఇచ్చుకోవాలి. అదే దక్షిణాది హీరోయిన్‌ని ఎంచుకుంటే మాత్రం కోటి రూపాయలు లోపే వారి పారితోషికం ఉంటుంది. హిందీ సినిమాలో ఆఫర్‌ అనే సరికి సౌత్‌ హీరోయిన్లు తమ పారితోషికం తగ్గించుకుంటున్నారు కూడా. అందుకే సౌత్‌ హీరోయిన్స్‌కి బాలీవుడ్‌లో డిమాండ్‌ బాగా పెరిగింది. ఆల్రెడీ పరిచయమైన హీరోయిన్ల కంటే ఇంకా బాలీవుడ్‌లో అడుగు పెట్టని వారికి ఫ్రెష్‌ అప్పీల్‌ బాగా హెల్ప్‌ అవుతోంది.

అందుకే ఇప్పటివరకు బాలీవుడ్‌తో ముఖ పరిచయం లేని నయనతారకి అక్కడ్నుంచి ఆఫర్స్‌ బాగా వస్తున్నాయి. ఇటీవల షాహిద్‌ కపూర్‌ సరసన నటించే అవకాశం ఆమెకి వచ్చింది. అయితే నయనతార తన సౌత్‌ అసైన్‌మెంట్స్‌తో బిజీగా ఉండడంతో వారు అడిగిన డేట్స్‌ ఇవ్వలేకపోయింది. అయితే బాలీవుడ్‌లో అడుగు పెట్టాలనే కోరిక తనకి ఉందని నయనతార అంటోంది. త్వరలోనే అది నెరవేర్చుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో కహానీ రీమేక్‌లో నటిస్తోన్న నయనతార ఈ చిత్రంతో నటిగా తన పరపతి పెంచుకుంటానని ధీమాగా ఉంది. కహానీతో విద్యాబాలన్‌ స్టార్‌డమ్‌ ఎంతగా పెరిగిందనేది తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు