కాజల్‌కి డబ్బు పిచ్చి ముదిరింది

కాజల్‌కి డబ్బు పిచ్చి ముదిరింది

వరుసగా హిట్‌ సినిమాల్లో నటిస్తున్న కాజల్‌ ఇప్పుడు తనకి ఉన్న డిమాండ్‌ని క్యాష్‌ చేసుకోవాలని చూస్తోంది. హీరో, డైరెక్టర్‌ ఎవరనేది కాకుండా తనకి ఎంత ఇస్తారనేదే ఆమె పరిగణిస్తోంది. ఈమధ్య కాలంలో కాజల్‌కి పెరిగిన డబ్బు పిచ్చి వల్ల ఆమె పలు చిత్రాల్లో అవకాశం కోల్పోయింది.

ఇంకా తన కెరీర్‌ ఎంతో కాలం ఉండదని, కాబట్టి పీక్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవడం తప్పేమీ కాదని కాజల్‌ జీవిత సత్యాలు వల్లిస్తోంది. ఇంతకాలం నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకుని చాలా కంఫర్టబుల్‌ హీరోయిన్‌ అనిపించుకున్న కాజల్‌ సడన్‌గా ఇలా చేయడం పట్ల చిత్ర పరిశ్రమలో చిత్రంగా చెప్పుకుంటున్నారు.

అయితే ఆమెకి తమిళంలో, హిందీలో కూడా ఆఫర్లు ఉన్నాయి కాబట్టి తనకి తగిన విధంగా కుదిరిన సినిమాలే ఎంపిక చేసుకుని చేయడం తప్పేమీ కాదని ఆమె సన్నిహితులు సమర్ధిస్తున్నారు. హీరోయిన్‌కి ఫ్లాప్స్‌ వచ్చినప్పుడు కనీసం ముఖం కూడా చూడరు కాబట్టి సక్సెస్‌లో ఉన్నప్పుడు క్యాష్‌ చేసుకోవడం మంచిదేనని వారి అభిప్రాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English