నితిన్ గురించి మరిచిపోయావేంటి సమంతా..?

నితిన్ గురించి మరిచిపోయావేంటి సమంతా..?

సమంత ఇప్పటి వరకు చిన్నా పెద్ద హీరోలందరితోనూ నటించింది. ఎక్కువగా పెద్దోళ్లతోనే జోడీకట్టింది. నాగచైతన్య రేంజ్ చిన్నదైనా.. సమంత మనసులో మాత్రం ఆయన చాలా పెద్ద హీరో. ఇక ఇప్పుడు నితిన్ తో రొమాన్స్ చేసింది. నిజానికి సమంతతో పోలిస్తే నితిన్ చిన్నోడే. ఎంత చిన్న హీరో అయినా.. నితిన్ కు కూడా ఓ మార్కెట్ ఉంది.. కొంత ఇమేజ్ ఉంది. 20 సినిమాలకు పైగా ఎక్స్ పీరియన్స్ ఉంది. అన్నింటికీ మించి తనతో పాటే యాక్ట్ చేసిన హీరో. అలాంటి క్రేజీ హీరో గురించి సక్సెస్ మీట్ లో మరిచిపోయింది సమంత.
 
త్రివిక్రమ్ గురించి ఓ రేంజ్ లో పొగిడేసింది.. ఎందుకంటే వరస సినిమాలు ఆఫర్లు ఇస్తున్నాడు కాబట్టి. ఆ తర్వాత నిర్మాతకు థ్యాంక్స్ చెప్పింది.. డబ్బులిచ్చాడు కాబట్టి. టెక్నికల్ టీం ను పొగిడింది.. బాగా చూపించారు కాబట్టి. కానీ నితిన్ ను మాత్రం మరిచిపోయింది. కావాలనే మరిచిపోయిందా.. లేదంటే ఫ్రెండే కదా ఏం అనుకోడులే అని చెప్పలేదో మరి సమంతకే తెలియాలి. ఎంత స్నేహితుడైనా కలిసి నటించిన హీరో గురించి కనీసం మాట్లాడకపోతే ఎలా సమంత గారూ..! ఇదే వేడుకలో నితిన్ మాత్రం సమంతను ఓ రేంజ్ లో పొగిడేసారు. కనీసం ఇది విన్నపుడైనా నితిన్ గురించి నేను మాట్లాడలేదే అనుకోలేదా సమంతా జీ..! ఏమో అన్నీ మీకు తెలిసిన రాజకీయాలే మరీ..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు