య‌ద్ద‌న‌పూడి ఓకే.. మ‌రి మీనా ప‌రిస్థితేంటి త్రివిక్ర‌మ్..?

య‌ద్ద‌న‌పూడి ఓకే.. మ‌రి మీనా ప‌రిస్థితేంటి త్రివిక్ర‌మ్..?

అ..ఆ సినిమా విడుద‌లైంది. సూప‌ర్ హిట్ దిశ‌గా న‌డుస్తోంది. వ‌సూళ్లు కూడా అదిరిపోయాయి. రెండ్రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 15 కోట్లు వ‌సూలు చేసింది. దాంతో పొంగిపోయిన చిత్ర‌యూనిట్ స‌క్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. అంతా బాగానే ఉంది. కానీ ఈ వేడుక‌లో త్రివిక్ర‌మ్ మాట‌లే కొంద‌రికి వింత‌గా అనిపించాయి. ఆయ‌నేం మాట్లాడ‌రో ఆయ‌న మాట‌ల్లోనే..

 ఈ మూవీని ఇంత సక్సెస్ చేసింనందుకు కృతజ్ఞతలు. ఈ సినిమాని మొద‌లుపెట్టే 9 నెలల ముందే నాకు ఇష్టమైన రైటర్ యద్దనపూడి సులోచనా రాణిగారితో మాట్లాడాను. ఆమె నుంచి ఇన్ పుట్స్ తీసుకున్నాను. ఆమె కూడా కొన్ని పాత్ర‌ల‌కు సంబంధించి మార్పులు చెప్పారు. ఓ రకంగా చెప్పాలంటే అ..ఆ.. చిత్రానికి మూలకథకు యద్దనపూడి సులోచనారాణి గారి పేరు వేయాలి. నిజానికి ఆమె పేరును థాంక్స్ కార్డ్ వేశాం కాని సాంకేతిక సమస్యల కారణంగా డిస్ ప్లే కాలేదు. ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించుకుని 48 గంటల్లోనే ఆమె పేరు డిస్ ప్లే వస్తుంది. ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోతుందని అనుకుంటున్నా. ఇంకా మాట్లాడాలని అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు.

య‌ద్ద‌న‌పూడి ర‌చ‌న ఆధారంగానే ఈయ‌న అ..ఆ సినిమా చేసాడనేది తెలిసిపోయింది. అయితే ఇక్క‌డే మ‌రో వాద‌న కూడా ఉంది. అదే మీనా సినిమా. అ..ఆ సినిమా చూసిన వాళ్లంతా ఇది 43 ఏళ్ళ కింద కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల న‌టించిన మీనా సినిమాకు మోడ్ర‌న్ వ‌ర్ష‌న్ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే త్రివిక్ర‌మ్ సీన్ టూ సీన్ దించేసి.. దానికే కాస్త త‌న స్టైల్ ఆఫ్ డైలాగులు జోడించాడ‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. స‌క్సెస్ మీట్ లో య‌ద్ద‌న‌పూడి గురించి మాట్లాడిన త్రివిక్ర‌మ్.. మీనా సినిమా గురించి మాత్రం ఒక్క మాటా మాట్లాడ‌క‌పోవ‌డం కృష్ణ అభిమానుల్ని బాధ పెట్టింది. మొత్తానికి ఈ వివాదానికి మాట‌ల మాంత్రికుడు ఎలా ఫుల్ స్టాప్ పెడ‌తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు