త్రివిక్రమ్‌కు రెమ్యూనరేషనే ఇవ్వలేదట

త్రివిక్రమ్‌కు రెమ్యూనరేషనే ఇవ్వలేదట

'అ ఆ" సినిమా బడ్జెట్లో మూడో వంతు త్రివిక్రమ్ పారితోషకమే ఇవ్వలేదంటూ మీడియాలో వార్తలొస్తున్నాయి. అది వాస్తవమే కూడా కావచ్చు. ఐతే రెమ్యూనరేషన్ ఎంతైనప్పటికీ ఇప్పటిదాకా అఆ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్‌కు పైసా కూడా ఇవ్వలేదని అంటున్నాడు నిర్మాత రాధాకృష్ణ. త్రివిక్రమ్‌కు మాత్రమే కాదు.. హీరో నితిన్‌కు సైతం పారితోషకం ఇవ్వలేదని ఆయన వెల్లడించాడు. వరుసగా త్రివిక్రమ్ మీ బేనర్లలోనే సినిమాలు చేస్తుండటానికి ఎక్కువ పారితోషకం ఇస్తుండటమే కారణమా అని రాధాకృష్ణను అడిగితే ఈ విషయం వెల్లడించాడు.

''మా ఇద్దరి బంధం గురించి చాలామందికి తప్పుడు అభిప్రాయాలున్నాయి. మా బంధానికి డబ్బు ఎంత మాత్రం కారణం కాదు. నాతో వేవ్ లెంగ్త్ కలవడం వల్ల.. కంఫర్టబుల్‌గా ఉండటం వల్ల వరుసగా మా బేనర్లో సినిమాలు చేస్తున్నాడు త్రివిక్రమ్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నేనింకా 'అ ఆ" సినిమాకు త్రివిక్రమ్, నితిన్‌లకు రెమ్యూనరేషనే ఇవ్వలేదు. త్రివిక్రమ్ ఇంతకుముందు ఇద్దరు నిర్మాతలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. దీంతో తనకు సౌకర్యంగా ఉండే నిర్మాతలతోనే పని చేయాలనుకుంటున్నాడు. నాతో అతడికి సౌకర్యవంతంగా అనిపించింది. నాదీ సేమ్ ఫీలింగ్. అందుకే మా బేనర్లో వరుసగా మూడు సినిమాలూ అతడితోనే చేశాం. నా తర్వాతి సినిమా కూడా త్రివిక్రమ్‌తోనే ఉంటుంది"" అని వెల్లడించాడు రాధాకృష్ణ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు