బన్నీ కోరికను లింగుస్వామి తీర్చేస్తున్నాడా?

బన్నీ కోరికను లింగుస్వామి తీర్చేస్తున్నాడా?

‘సరైనోడు’ ప్రి రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ ఓ మాటన్నాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి పోషించిన విలన్ పాత్రంటే తనకు చాలా ఇష్టమని.. ఈ సినిమాను ఇంకో భాషలో తీసేట్లయితే విలన్ పాత్రను తానే చేయాలనుకుంటున్నానని అన్నాడు. అప్పుడు బన్నీ మాటలు విన్నాక ఇన్‌స్పైర్ అయిపోయాడేంటో కానీ.. తమిళ దర్శకుడు లింగుస్వామి అతడి కోసం నెగెటివ్ క్యారెక్టర్ తయారు చేసినట్లు సమాచారం. లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ చేయబోయేది డ్యూయల్ రోల్ మూవీ అని అంటున్నారు. అందులో ఒకటి పాజిటివ్ పాత్ర అయితే.. ఇంకోదానికి నెగెటివ్ షేడ్స్ ఉంటాయట. ఈ పాత్ర నచ్చే బన్నీ ఈ సినిమాకు ఒప్పుకున్నాడట.

లింగుస్వామి సరైన సినిమా తీసి చాలా కాలమైంది. అతడి లాస్ట్ మూవీ అంజాన్ (తెలుగులో సికిందర్) పెద్ద డిజాస్టర్. మరోవైపు బన్నీ హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీదున్నాడు. అతడి కోసం చాలామంది సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు లైన్లో ఉన్నారు. అయినా బన్నీ మాత్రం లింగుస్వామినే ప్రిఫర్ చేశాడు. స్క్రిప్టు అంతగా నచ్చడమే దానికి కారణం అంటున్నారు. ‘సరైనోడు’తో సొంత బేనర్లో తిరుగులేని హిట్ కొట్టిన బన్నీ.. లింగుస్వామి సినిమాను కూడా తన తండ్రికే చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మలయాళంలో మంచి మార్కెట్ సంపాదించుకున్న బన్నీ.. ఈ సినిమాతో తమిళనాటా పాగా వేయాలనుకుంటున్నాడు. లింగుస్వామి తమిళనాట స్టార్ డైరెక్టర్. బన్నీ కూడా కొద్దిగా తమిళ ప్రేక్షకులకు పరిచయం. లింగుస్వామితో జతకడుతున్నాడు కాబట్టి.. సినిమా బాగుంటే అక్కడా అతడికి మంచి ఫాలోయింగ్ రావడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు