సమంతా.. ఇంకెవర్నీ ఊహించుకోలేం

సమంతా.. ఇంకెవర్నీ ఊహించుకోలేం

‘అఆ’లో అందరూ బాగానే చేశారు. ఎవ్వరి నటనకూ వంకలు పెట్టలేం. ఐతే అందర్లోకి షో స్టీలర్ ఎవరంటే కచ్చితంగా సమంత పేరే చెప్పాలి. ముందు నుంచి ఈ సినిమా సమంత కోణంలోనే సాగుతుందని.. హీరో పాత్రను డామినేట్ చేసేలా ఆమె క్యారెక్టర్ ఉంటుందని అనుకుంటున్నారు జనాలు. సినిమా చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

నితిన్ పాత్రకు ప్రాధాన్యం తగ్గిపోలేదు కానీ.. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అతణ్ని సమంత డామినేట్ చేసినందనడంలో సందేహం లేదు. ఇప్పటికే నటిగా మంచి గుర్తింపే తెచ్చుకున్నప్పటికీ.. సినిమా నుంచి బయటికి వచ్చాక కూడా గుర్తుండిపోయే పాత్రలు తక్కువే చేసింది సమంత. ‘అఆ’లోని అనసూయ పాత్ర మాత్రం కొన్నేళ్ల తర్వాత కూడా గుర్తుండిపోతుంది. ఆమె పాత్రను త్రివిక్రమ్ అంత బాగా డిజైన్ చేశాడు. అలాగే సమంత కూడా ఆ క్యారెక్టర్‌ను అంత బాగా చేసింది.

ఓ సినిమా చూసి.. ఫలానా పాత్రను ఆ ఆర్టిస్టు మాత్రమే చేయగలడు. అందులో ఇంకెవరినీ ఊహించుకోలేం అనిపించింది అంటే అంత కంటే గొప్ప కాంప్లిమెంట్ మరొకటి ఉండదు. ‘అఆ’లో సమంత పాత్ర కూడా అలాంటిదే. అనసూయ పాత్రలో ఇంకెవర్నీ ఊహించుకోలేం. తనకే సాధ్యమైన క్యూట్‌నెస్‌తో.. చిలిపి నటనతో, ఎక్స్‌ప్రెషన్లతో అదరగొట్టేసింది సామ్.

తన కెరీర్లో ‘అఆ’ చాలా చాలా ప్రత్యేకమని ఆమె ముందు నుంచి చెబుుతున్న మాటలు ఈ సినిమా చూశాక కరెక్టే అనిపిస్తుంది. మొత్తానికి సమ్మర్లో నాలుగు సినిమాలతో పలకరించిన సామ్.. ‘బ్రహ్మోత్సవం’లో మాత్రమే నిరాశ పరిచింది. మిగతా మూడు సినిమాలు (తెరి, 24, అఆ) ఆమెకు మంచి ఫలితాన్నిచ్చాయి. ముఖ్యంగా చివర్లో ‘అఆ’ ఆమెకు అన్ని రకాలుగానూ సంతృప్తిని మిగిల్చేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు