‘‘అ ఆ’’ చూడగానే ‘‘మీనా’’ గుర్తుకొచ్చిందేంటి త్రివిక్రమ్?

‘‘అ ఆ’’ చూడగానే ‘‘మీనా’’ గుర్తుకొచ్చిందేంటి త్రివిక్రమ్?

తన తాజా సినిమాలో పెద్ద కథేం ఉండదంటూ ఎవరి కన్ను కథ మీద పడకుండాచేసిన త్రివిక్రమ్ భలే తెలివైన పని చేశాడనిపిస్తుంది ‘అ ఆ’ సినిమాచూసినంతనే. రెండు వరుస అక్షరాల్ని సినిమా పేరుగా పెట్టేసి తనతెలివితేటల్ని ప్రదర్శించిన ఆయన.. తాను తీసిన తాజా సినిమా అప్పుడెప్పుడో43 ఏళ్ల క్రితం వచ్చిన ‘‘మీనా’’ సినిమా అన్న విషయాన్ని కూడా ఓపెన్ గాచెప్పేసి ఉంటే ఎంత బాగుండేదో?

మీనా కథకు.. త్రివిక్రమ్ మార్క్ మాటల్ని వేసి.. ఇప్పటి హంగుల్ని జోడించి..సమంత లాంటి స్టార్ హీరోయిన్ ను పెట్టి.. కళ్లు తిప్పుకోకుండా ఉండేలా నలభై..యాభై సెకన్ల టీజర్ ను ముందుగా జనాల్లోకి వదిలేసి.. ఒక పద్ధతి ప్రకారంప్రచారం చేసి భారీ అంచనాలకు గురయ్యేలా చేసి.. ఎప్పుడూ రిలీజ్అవుతుందా? అంటూ ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన ‘అ ఆ’ సినిమానుచూస్తున్నప్పుడు పాత సినిమాల్ని బాగా చూసే వాళ్లకు కరెంటు షాక్కొట్టినట్లుగా అవుతుంది.

సూపర్ స్టార్ కృష్ణ.. విజయనిర్మల జంటగా నటించిన అప్పటి మీనా సినిమానుయూట్యూబ్ లో చూస్తే.. త్రివిక్రమ్ కథల్ని ఇలా పుట్టిస్తాడా? అన్న సందేహంకలగక మానదు. అదేం చిత్రమో కానీ.. మీనా సినిమాలోని మొదటి సీన్మొదలు కొని.. దాదాపుగా ఎక్కడా పెద్ద కష్టపడకుండా అలాంటి సన్నివేశాల్నినేటి డిజిటల్ కాలానికి తగ్గట్లుగా చుట్టేయటంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారనిచెప్పక తప్పదు. సమస్యంతా ఎక్కడొస్తుందంటే.. త్రివిక్రమ్ కు ఇప్పుడొచ్చినఆలోచన అప్పుడెప్పుడో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే ఎవరికోవచ్చేయటంతోనే. నాటి సినిమాను ఫ్రీమేక్ చేస్తున్నానంటూ చెబితే ఎవరుమాత్రం ఏమంటారు? కానీ.. అందుకు భిన్నంగా.. పక్కపక్కనే ఉండే రెండుఅక్షరాలు కలవటానికి ఇంతకాలం పట్టిందా? అంటూ ఎమోషనల్ టచ్ లు అద్ది..అదంతా తన సొంతమన్నట్లుగా చెప్పుకోవటంలోనే ఇబ్బంది అంతా.

ఇక.. అ ఆ సినిమాలో హీరోయిన్ తల్లి.. తండ్రి క్యారెక్టర్లు మాత్రమే కాదు.. వారివృత్తుల్ని సైతం యధాతధంగా దించేసిన వైనం చూస్తే.. కాపీ కొట్టేటప్పుడుఎదవ మొహమాటాలకు పడి.. బుర్రను అట్టే హీటెక్కించుకోవాల్సిన అవసరంలేదన్న విషయం అర్థమవుతుంది. కథ.. అందులోని పాత్రల్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా మార్చేయటం కంటే కూడా.. తన మార్క్ డైలాగుల్ని నాలుగుఎక్కువ రాసుకోవటం మీదనే ఫోకస్ చేశారని చెప్పాలి.

అందుకే.. మీనా సినిమాలో కనిపించే సీక్వెల్ లోనూ అ ఆ సినిమా సీన్లుదాదాపుగా కలుస్తాయి.

కొన్నేళ్ల క్రితమే తనకీ కథను త్రివిక్రమ్ తనకు చెప్పినట్లుగా పవన్ కల్యాణ్ ఆమధ్య చెప్పటం గుర్తు చేసుకుంటే.. చప్పున మనసుకు అనిపించే ఒక్కమాటేమిటంటే.. ‘అ ఆ’ కథను పవన్ కల్యాణ్ కు కాకుండా.. మహేశ్ బాబుకుచెప్పి.. ఆయన ఇంటప్రెస్ అయి సూపర్ స్టార్ కృష్ణకు చెప్పి ఉంటే ఎలాఉండేదో? యద్దనపూడి సులోచనారాణి రాసిని కథను అప్పట్లో మీనాగా తీస్తే36 థియేటర్లలో 50 రోజులు.. 9 థియేటర్లలో 100 రోజులు ఆడి కలెక్షన్లసునామీనే సృష్టించింది.

నితిన్ క్యారెక్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ.. సమంత క్యారెక్టర్ ను సమంత.. నరేశ్క్యారెక్టర్ ను జగ్గయ్య ఇలా చెప్పుకుంటే మీనా సినిమాలో కనిపించే పాత్రలుదాదాపుగా కనిపిస్తాయి మరి. చివరగా ఒక్కమాట.. 70ల్లో పుట్టినోళ్లకు ‘‘పెళ్లంటేనూరేళ్ల పంట.. అది పండాలి..’’ అన్న పాటను అప్పట్లో తరచూ వినేవాళ్లు. పాట ఎక్కడిదో కాదు.. మీనా సినిమాదే. అదేనండి.. అ ఆ మాతృకలోది. డౌట్అనిపించిందా? అయితే మొదట యూట్యూబ్ లో మీనా చూడండి.. ఆ తర్వాతఅ ఆ కు వెళ్లండి.. తివిక్రమ్ మేధస్సు ఎంతో ఇట్టే అర్థమైపోతుంది. ఇక ఆలస్యంఎందుకు ఒకసారి ట్రై చేయొచ్చుగా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు