మారుతి పూర్తిగా మారినట్లేనా..?

మారుతి పూర్తిగా మారినట్లేనా..?

మారుతి.. ఈ పేరు వింటే చాలు.. అడల్ట్ సినిమాలు, కుళ్లు జోకులు గుర్తొచ్చేవి. ఇండస్ట్రీలోకి రావడానికి.. గుర్తింపు తెచ్చుకోడానికి ఈరోజుల్లో, బస్టాప్ లాంటి లో క్వాలిటీ సినిమాలు తీసాడు మారుతి. కానీ వాటిని కూడా కమర్షియల్ గా హిట్ చేసిన ఘనత ఈ దర్శకుడిదే. అయితే డబ్బులొచ్చినా.. స్టార్స్ ఎవరూ మారుతిని నమ్మలేదు.. విమర్శకులు తిట్లదండకం ఆపలేదు. స్వయంగా మారుతి తన బెస్ట్ ఫ్రెండ్ గా చెప్పుకునే బన్నీ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయడానికి సాహసించలేదు.

ప్రేమకథాచిత్రం, లవర్స్ లాంటి సినిమాలతో తో మారిన మారుతిని చూపించాడు ఈ దర్శకుడు. అయినా అలవాటైన చేయి కావడంతో.. అందులోనూ కాసిన్ని డబుల్ మీనింగ్ డైలాగులు పడేసాడు మారుతి. తర్వాత కొత్తజంటతో క్లీన్ సినిమా తీసాడు కానీ అది కాస్తా బాక్సాఫీస్ దగ్గర నిలబలేదు. దాంతో మారుతికి బూతు సినిమాలు తప్ప.. క్లీన్ సినిమాలు తీయడం రాదంటూ మరోసారి విమర్శలు మొదలయ్యాయి.

అయితే గతేడాది నానితో భలేభలే మగాడివోయ్ రూపంలో ఏకంగా ఎ సర్టిఫికేట్ సినిమా నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ సినిమా తీసి.. బ్లాక్ బస్టర్ చేసి చూపించాడు మారుతి. ఈ సినిమా చూసిన వాళ్లంతా.. నిజంగా ఇది తీసింది మారుతినేనా అని షాకయ్యారు. ఇక ఇప్పుడు వెంకటేశ్ తో బాబు బంగారం చేస్తున్నాడు మారుతి. ఈ సినిమా కూడా క్లీన్ సినిమాగానే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా ఎలా ఉండ బోతుందో తెలుస్తోంది. జూన్ 6న టీజర్ విడుదల కానుంది. చూడాలి మరి.. బాబు బంగారం తర్వాత మారుతి రేంజ్ కూడా బంగారంలా పెరిగిపోతుం దేమో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు