సిసిఎల్ లో పరిచయం ప్రేమగా మారింది

సిసిఎల్ లో పరిచయం ప్రేమగా మారింది

ఆమె ఒక స్టార్ హీరోయిన్.. అతనో బిజినెస్‌మేన్. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లికి రెడీ అయిపోయారు. ఇంతకీ వీళ్లిద్దరిలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేసి ఉంటారు? ఈ ప్రశ్నకు చాలామంది ఆ బిజినెస్‌మేనే అని సమాధానం చెబుతారు. కానీ ఇక్కడ జరిగింది వేరు. రెండు రోజుల ముందే తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్‌తో ప్రియమణి ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమకథలో మలుపేంటంటే.. ముందు ప్రియమణే ముస్తఫాకు ప్రపోజ్ చేసిందట. ఐతే ‘ఐ లవ్యూ’ అని కాకుండా ‘ఐ లైక్ యూ’ అని అతడికి ఆమె మెసేజ్ చేసిందట.

త్వరలోనే ముస్తఫాను పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో తనకు కాబోయే భర్తతో పరిచయం.. ప్రేమ గురించి మీడియాతో ఓపెన్‌గా మాట్లాడింది ప్రియమణి. ముస్తఫాతో తనకు ఐదేళ్ల నుంచి అనుబంధం ఉందని.. సెలబ్రెటీ క్రికెట్ లీగ్ సందర్భంగా తమ ఇద్దరికీ పరిచయం జరిగిందని ఆమె వెల్లడించింది. నెమ్మదిగా అభిరుచులు కలిశాయని.. అతడి తీరు తనకు నచ్చడంతో ‘ఐ లైక్ యూ’ అని మెసేజ్ పెట్టానని.. తర్వాత తాను అతడితో సీరియస్ రిలేషన్ కోరుకున్నానని ఆమె వెల్లడించింది.

బెంగళూరులో చాలా సింపుల్‌గా ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కారణం చెబుతూ.. ‘‘నిజానికి ఈ వేడుక భారీ స్థాయిలోనే ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈ మధ్యే మా పెదనాన్న చనిపోయారు. ఆయన మా నాన్నకు తండ్రి లాంటి వారు. దీంతో మా ఫ్యామిలీ అంతా చాలా బాధలో ఉంది. అందుకే ఎంగేజ్మెంట్ సింపుల్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.

ఈ సంగతి ముస్తఫాకు చెబితే అతనెలాంటి అభ్యంతరం చెప్పలేదు. పెళ్లి కూడా హడావుడి లేకుండా రిజిస్టర్ ఆఫీస్‌లో చేసుకోబోతున్నాం. తర్వాత రిసెప్షన్ పెడతాం. ఇంకా పెళ్లి తేదీ నిర్ణయించలేదు’’ అని ప్రియమణి వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English