ఈగ విలన్ మళ్లొస్తున్నాడహో..

ఈగ విలన్ మళ్లొస్తున్నాడహో..

రాజమౌళి పరిచయం చేసిన పరభాషా విలన్లందరూ తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వరుసగా అవకాశాలు అందుకున్నారు. ఐతే 'ఈగ" ఫేమ్ సుదీప్ మాత్రం అనుకున్న స్థాయిలో ఇక్కడ క్లిక్కవ్వలేదు. కన్నడలో హీరోగా బిజీగా ఉండటం వల్ల అతనే ఉద్దేశపూర్వకంగా తెలుగు సినిమాలు చేయలేదా.. లేక తనకు తగ్గ పాత్రల్ని ఇక్కడి దర్శకులు ఆఫర్ చేయలేదా తెలియదు కానీ.. 'ఈగ" తర్వాత 'యాక్షన్ త్రీడీ".. 'బాహుబలి" సినిమాల్లో చాలా షార్ట్ రోల్స్ మాత్రమే చేశాడు సుదీప్. 'బాహుబలి" వచ్చి కూడా దగ్గర దగ్గర ఏడాదవుతున్నా మళ్లీ ఇంకే సినిమాలోనూ కనిపించని సుదీప్ కు ఎట్టకేలకు ఓ క్రేజీ ప్రాజెక్టులో చోటు దక్కింది.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'నక్షత్రం"లో సుదీప్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అది విలన్ క్యారెక్టరా లేక ఇంకేదైనా స్పెషల్ క్యారెక్టరా అన్నది తెలియదు. ఈ సినిమాలో సుదీప్ నటిస్తుండటం అయితే వాస్తవం. సందీప్ కిషన్ హీరోగా గత నెలలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. మరోవైపు ఈ సినిమాలో చందమామ కాజల్ కూడా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ రెండు వార్తలూ వాస్తవమే అయితే.. ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ రావడం ఖాయం. కృష్ణవంశీ నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. 'చందమామ" తర్వాత ఒక్క హిట్టూ కొట్టేదాయన. వరుస ఫ్లాపుల తర్వాత 'గోవిందుడు అందిరివాడేలే" పర్వాలేదనిపించినా అందులో కృష్ణవంశీ మార్కు మిస్సయింది. 'నక్షత్రం" మళ్లీ కృష్ణవంశీ ముద్ర చూపిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు