ఐతే పవన్‌ను ఫుల్లుగా వాడేస్తారన్నమాట

ఐతే పవన్‌ను ఫుల్లుగా వాడేస్తారన్నమాట

‘‘రావణాసురుడి మమ్మీ డాడీ కూడా సూర్పనకను సమంతనే అనుకుంటారు కదే’’.. ‘‘రావణాసురుడు వాళ్లావిడ కూడా వాళ్లాయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది’’.. ఇవీ ‘అ..ఆ’ ట్రైలర్లో వినిపించిన డైలాగులు. డైలాగ్స్ కొంచెం ఫన్నీగా ఉన్నప్పటికీ.. ఇవేవో కావాలని ఇరికించిన డైలాగుల్లాగే అనిపిస్తాయి. సమంతను హీరోయిన్‌గా పెట్టుకుని.. ఆమె పేరునే ఇలా వాడుకోవడం విడ్డూరం. ఇక పవన్ కళ్యాణ్ పేరు వాడ్డం కూడా కొంచెం అతిగానే అనిపించింది జనాలకు. ఇక్కడే పవన్ మీద నితిన్ వీరాభిమానం.. పవన్‌తో త్రివిక్రమ్ స్నేహం గుర్తుకొచ్చాయి జనాలకు. తన సినిమాల్లో పవన్‌ను నితిన్ ఫుల్లుగా వాడేసుకోవడం కొత్తేమీ కాదు.

ఐతే త్రివిక్రమ్ ఇప్పటిదాకా పవన్‌ను వాడుకునే ప్రయత్నమేదీ చేయలేదు. ఐతే నితిన్ కోసమే ఇలా చేశాడో.. లేక తనకే స్వయంగా పవన్‌ను వాడుకోవాలని అనిపించిందో తెలియదు కానీ.. త్రివిక్రమ్ పవన్ పేరొచ్చేలా ఇలా డైలాగ్ రాయడం మాత్రం ఆశ్చర్యం కలిగించేదే. సినిమాలో కూడా ఇలాంటి డైలాగులు పడితే ఆశ్చర్యమేమీ లేదనే అనిపిస్తోంది.

పవన్‌కు త్రివిక్రమ్ అత్యంత సన్నిహితుడు కాబట్టి.. పవర్ స్టార్ అభిమానులు ఆయన సినిమాల్ని మామూలుగానే బాగా సపోర్ట్ చేస్తారు. ఇక తమ హీరో గురించి డైలాగులు పడితే ఇక వాళ్ల ఉత్సాహానికి కొదవేముంటుంది? నితిన్ స్టార్ హీరో కాకపోయినా సరే.. ‘అఆ’కు తెలుగు రాష్ట్రాల్లోనే కాక బయటి టెరిటరీస్‌లో కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ గురువారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు