బ్రహ్మోత్సవం ఎంత ముంచేసింది?

బ్రహ్మోత్సవం ఎంత ముంచేసింది?

బ్రహ్మోత్సవం భవిష్యత్తేంటో తెలిసిపోయింది. రెండో వారం కూడా గడిచిపోయింది. ఇక ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి కూడా మరలిపోయింది. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు అందరి దృష్టి బ్రహ్మోత్సవంతో మహేశ్ ఎంత నష్టాలు తీసుకొచ్చాడనే దానిపైనే. ఈ సినిమాకు 73 కోట్ల బిజినెస్ జరిగింది. తొలిరోజు వచ్చిన టాక్ తో బయ్యర్లకు అప్పట్నుంచే నిద్ర పట్టట్లేదు.

ఫస్ట్ డే 12 కోట్లు వసూలు చేసింది బ్రహ్మోత్సవం. కానీ రెండోరోజు నుంచే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. చాలా సెంటర్లలో ఈ సినిమా తీసేసి.. సుప్రీమ్ తో నింపేసారు. ఇంకా నమ్మలేని నిజం ఏంటంటే మన సూపర్ స్టార్ సినిమా స్థానంలో తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు వేసుకున్నారు. ఈ మధ్య కాలంలో మహేశ్ కెరీర్ లో ఇంత దారుణమైన సినిమాను చూడలేదంటూ అభిమానులే నిట్టూరుస్తున్నారు.

సినిమా ఎలా ఉన్నా.. ఇప్పటి వరకు 35 కోట్లు వసూలు చేసింది బ్రహ్మోత్సవం. అది కూడా ఓవర్సీస్ లో 7 కోట్లు రావడంతో 35 కోట్ల మార్క్ అయినా అందుకుంది. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మోత్సవం ఇప్పటి వరకు రాబట్టింది 22 కోట్లు మాత్రమే. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కావాల్సింది 54 కోట్లు. అంటే అక్షరాలా 30 కోట్లకు పైగా పెద్ద రంధ్రమే.

ఇక ఓవర్సీస్ లోనూ 13 కోట్లకు అమ్మారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వరల్డ్ వైడ్ గా లైఫ్ టైమ్ బిజినెస్ చూసుకుంటే బ్రహ్మోత్సవం 35 కోట్లే వచ్చాయి. అంటే దాదాపు అటూ ఇటూగా 40 కోట్ల నష్టాలు ఖాయం. మరి బయ్యర్లను మహేశ్ అండ్ కో ఆదుకుంటారో లేదో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు