పద్దతులు మార్చుకుంటున్న రామ్..

పద్దతులు మార్చుకుంటున్న రామ్..

కెరీర్ మొదలై పదేళ్లు దాటేసింది. ఇప్పటి వరకు తాను నమ్మిన బాటలోనే వెళ్లాడు రామ్. హిట్టిచ్చినా.. ఫ్లాపొచ్చినా ఎవ్వరినీ పట్టించుకోలేదు. తన దారేదో తాను చూసుకున్నాడు. కానీ ఇన్నేళ్ళ తర్వాత రామ్ కు ఏదో అయింది. లేకపోతే మరేంటి..? ఇప్పటి వరకు రిపీట్ కాంబినేషన్ అంటేనే పెద్దగా పట్టించుకోని రామ్.. ఇప్పుడు వరసగా వాళ్లే కావాలంటున్నాడు. గతంలో హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా పనిచేసిన దర్శకులతోనే మళ్లీ పని చేస్తానంటున్నాడు. ఇది కాస్త విచిత్రంగా అనిపించినా.. ఇదే నిజం మరి.

రామ్ ప్రస్తుతం కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమలతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు రామ్. ఇదిలా ఉండగానే తాజాగా మరో క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసాడు ఈ కుర్ర హీరో. గతంలో తానకు ఎందుకంటే ప్రేమంట లాంటి దిమ్మతిరిగిపోయే ఫ్లాపిచ్చిన కరుణాకరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్.

ఎందుకంటే ప్రేమంట ఫ్లాపైనా.. అందులో కరుణాకరణ్ ఆలోచనకు అంతా ఫిదా అయిపోయారు. అది నచ్చే ఇప్పుడు ఆయన రాసుకొచ్చిన ప్రేమకథకు మరోసారి పడిపోయాడు రామ్. మొత్తానికి వరసగా రిపీట్ కాంబినేషన్ లతో రచ్చ చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English