వాళ్ల బ్రేకప్ ఆ సినిమా చావుకొచ్చింది

వాళ్ల బ్రేకప్ ఆ సినిమా చావుకొచ్చింది

ఎంత సినిమా వాళ్లయినప్పటికీ.. ఒకసారి బ్రేకప్ అయిన హీరో హీరోయిన్ మళ్లీ కలిసి ఓ సినిమా చేయడానికి ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే చాలామంది ఇందుకు ఒప్పుకోరు. ఐతే ఈ మధ్య కొన్ని జంటలు ఇలాంటివేమీ పట్టించుకోకుండా.. ఎంచక్కా మళ్లీ కలిసి సినిమాల్లో నటించారు. ఎప్పట్లాగే కెమిస్ట్రీ పండించారు. తాము చాలా ప్రొఫెషనల్ అని చాటుకున్నారు. సౌత్‌లో శింబు-నయనతార.. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్.. రణబీర్ కపూర్-దీపికా పదుకొనే ఆ కోవలోకే వస్తారు. ఐతే సల్మాన్‌తో కత్రినా.. దీపికతో రణబీర్ ఏ ఇబ్బందీ లేకుండా నటించేశారు కానీ.. వీళ్లిద్దరూ కలిసి చేయాల్సి వచ్చేటప్పటికీ సమస్య మొదలైంది.

వీళ్లిద్దరూ ఓ దశలో డీప్ లవ్‌లో మునిగిపోయి.. పెళ్లి వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఏడడుగులు వేయడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో కొన్ని నెలల కిందటే విడిపోయారు. ఐతే ఈ విడిపోయే టైంలోనే ‘జగ్గా జాసూస్’ సినిమాకు కమిటై ఉన్నారు. సినిమా షూటింగ్ సగం అయ్యాక విడిపోయిన రణబీర్-కత్రినా.. మిగతా షూటింగ్‌కు సహకరించట్లేదట.

సెట్లో ముభావంగా ఉంటూ.. సన్నివేశాలు మొక్కుబడిగా చేస్తుండటంతో కెమిస్ట్రీ పండట్లేదని దర్శకుడు అనురాగ్ బసు ఫీలైపోతున్నాడట. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఇద్దరూ అంగీకరించట్లేదట. దీంతో కొన్నిసార్లు డూప్‌లను పెట్టి లాగించాల్సిన పరిస్థితి వస్తోందట. వీళ్లిద్దరి బ్రేకప్.. తన సినిమాను ఎక్కడ దెబ్బ తీస్తుందో అని ఆందోళన చెందుతున్నాడట బసు. మరి ఈ సినిమా ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు