బ్రెజిల్‌లో ఈగ సంద‌డి!

బ్రెజిల్‌లో ఈగ సంద‌డి!

రాజ‌మౌళి ఈగ బ్రెజిల్ చిత్రోత్సవాల్లోనూ  సంద‌డి చేసింది. విదేశీ చిత్ర ప‌రిశ్రమ‌ల‌ను తెగ ఆక‌ట్టుకొంది. ముఖ్యంగా ఇందులో క‌నిపించిన మైక్రో ఆర్ట్ వ‌ర్క్ ఆక‌ట్టుకొంది. అందుకే ఆ చిత్రం క‌ళా విభాగానికి అవార్డును ప్రక‌టించింది జ్యూరీ. ఆ విషయాన్ని ఈగ క‌ళా ద‌ర్శకుడు ర‌వీంద‌ర్ రెడ్డి విలేక‌రుల‌తో పంచుకొన్నాడు.

అంత పెద్ద తెర‌పై చిన్న ఈగ‌ని చూపించ‌డం మామూలు విష‌యం కాద‌నీ... అందుకోసం చాలా క‌ష్టప‌డ్డాన‌నీ ర‌వీంద‌ర్‌రెడ్డి తెలిపారు. బియ్యం గింజలు, ఆవాల‌తో  చిన్న చిన్న ఈగ‌ల్ని త‌యారు చేశామ‌న్నారు. వాటిని కెమెరా ముందుకు తీసుకెళ్లడానికి చాలా క‌ష్టప‌డ్డామ‌నీ, అలాగే ఇందులో క‌థానాయిక చేసే మైక్రో ఆర్ట్ వ‌ర్క్ కోసం కూడా సృజ‌నాత్మక‌త‌తో ఆలోచించి వ‌స్తువుల‌ను త‌యారు చేశామ‌ని తెలిపారు. అయితే మేం ప‌డ్డ ఈ క‌ష్టానికి వ‌చ్చిన గుర్తింపు మాత్రం నిరాశ‌కు గురిచేసిందనీ అన్నారు. క‌ళా ద‌ర్శక‌త్వం ప‌నితీరును ఎవ్వరూ గుర్తించలేక‌పోయార‌నీ, ఇప్పుడు బ్రెజిల్ చిత్రోత్సవాల్లో మా ప‌నికి త‌గిన గుర్తింపు ల‌భించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని తెలిపారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు