పవన్ కళ్యాణ్ ఫోన్.. నితిన్ షాక్

పవన్ కళ్యాణ్ ఫోన్.. నితిన్ షాక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నితిన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. తాను హీరో కావడానికి ఇన్‌స్పిరేషనే పవన్ అని.. తన కెరీర్ స్లంప్‌లో ఉండగా పవన్ ‘ఇష్క్’ సినిమా ఆడియోకు వచ్చి ఆశీర్వదించడం వల్లే తాను మళ్లీ నిలదొక్కుకోగలనని చెబుతూ ఉంటాడు నితిన్. ఈ మధ్య ‘అ..ఆ’ వేడుకకు కూడా పవన్ ముఖ్య అతిథిగా వచ్చాడు.

ఆ సినిమా షూటింగ్ సందర్భంగా కూడా ఓ రోజు సెట్‌కు రావడం తనకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పిన నితిన్.. తాజాగా పవన్ కళ్యాణ్ నుంచి తనకు కాల్ రావడం చూసి షాకైపోయానన్నాడు. ఐతే నిజానికి పవన్ తనకు కాల్ చేయలేదని.. త్రివిక్రమే ఆయన ఫోన్‌తో కలిసి తనకు షాకిచ్చాడని నితిన్ వెల్లడించాడు.

‘‘అఆ.. సినిమా ప్రమోషన్‌కు వస్తుంటే ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ గారి నంబర్ నుంచి కాల్ వచ్చింది. నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. గుండె ఆగిపోయినట్లయింది. పవన్ సార్ నాకు ఫోన్ చేయడమేంటి అనిపించింది. నేనేమైనా తప్పుగా నంబర్ నోట్ చేసుకున్నానేమో అని చూసుకున్నా. ఐతే ఫోన్ తీస్తే త్రివిక్రమ్ గారు మాట్లాడారు. ఆయన నన్ను ఆట పట్టించడానికే అలా చేశారని అర్థమైంది. అప్పుడు పవన్ గారు, త్రివిక్రమ్ గారు ఒకే చోట ఉన్నారు. నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని త్రివిక్రమ్ అలా చేశారు’’ అని నితిన్ వెల్లడించాడు.

‘అ.ఆ’ షూటింగ్ సందర్భంగా త్రివిక్రమ్‌తో పవన్ గురించి చాలా అడిగి తెలుసుకున్నానని.. పవన్ గురించి తన సందేహాలన్నీ తీర్చుకున్నానని నితిన్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు