బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా..

బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా..

పోస్టర్లకు పాలాభిషేకాలు చేయడాలు.. భారీ లెవెల్లో పూలదండలు సమర్పించడాలు.. తమ వాహనాల్ని కొత్త సినిమా పోస్టర్లతో అలంకరించడాలు.. థియేటర్ల దగ్గర క్యూలు కట్టడాలు.. తెరమీద బొమ్మ పడగానే కేరింతలతో హంగామా చేయడాలు.. ఇవన్నీ లోకల్ స్టార్ల విషయంలోనే జరుగుతాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్లను మినహాయిస్తే పరభాషా హీరోలకు ఇలాంటి రిసెప్షన్ అన్నది అరుదైన విషయమే. ఐతే కేరళలో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇలాంటి ఆదరణే దక్కుతోంది.

నిన్న ‘సరైనోడు’ మలయాళ వెర్షన్ ‘యోధవు’ విడుదల సందర్భంగా కేరళలో నెలకొన్న హంగామా అంతా ఇంతా కాదు. స్వయంగా అల్లు అర్జునే ఆ హంగామా చూసి ఆశ్చర్యపోతూ.. కేరళలో తన సినిమా విడుదల సందర్భంగా నెలకొన్న హడావుడికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసి.. ఇంత అభిమానం చూపిస్తున్న అభిమానులకు చాలా థ్యాంక్స్ అని ఇవాళ ట్వీట్ పెట్టాడు. సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ అందించినందుకు కూడా కేరళ జనాలకు ధన్యవాదాలు చెప్పాడు.

నిన్న కేరళ వ్యాప్తంగా 80 స్క్రీన్లలో (అక్కడిది పెద్ద నంబరే) రిలీజైన ‘యోధవు’కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తొలి రోజు రూ.75 లక్షల నుంచి రూ.80 లక్షల దాకా షేర్ కలెక్ట్ చేసిందట ఈ సినిమా. ఓ పరభాషా కథానాయకుడికి ఇది చాలా పెద్ద ఫిగరే. వీకెండ్లో రూ.2 కోట్ల దాకా షేర్ వసూలయ్యే అవకాశముంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఫుల్ రన్లో ఓ నాలుగైదు కోట్లయినా ఖాతాలో వేసుకోకపోదు. మొత్తానికి కేరళలో సినిమా సినిమాకూ బన్నీకి క్రేజ్ పెరిగిపోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు