నాగార్జున పాత్రలో ఉపేంద్ర..

నాగార్జున పాత్రలో ఉపేంద్ర..

కన్నడలో వేరే భాషల సినిమాల్ని అనువాదం చేసి రిలీజ్ చేయడం నిషిద్ధం. ఓ దశలో అనువాదాలు కన్నడ రాష్ట్రాన్ని ముంచెత్తేస్తుంటే.. తమ సినిమా ఉనికికే ప్రమాదం అని భావించి డబ్బింగ్ సినిమాల్ని నిషేధించింది అక్కడి సినీ పరిశ్రమ. దీంతో డైరెక్టుగా వేరే భాషల సినిమాల్నే రిలీజ్ చేయడం.. లేదంటే రీమేక్ చేయడం.. ఇలా తయారయ్యారు ఫిలిం మేకర్స్. కన్నడలో ఏటా తెరకెక్కే సినిమాల్లో సగానికి సగం రీమేక్లే ఉంటుంటాయి.

స్టార్ హీరోలు సైతం చాలామంది రీమేక్లనే నమ్ముకుంటారు. చివరికి క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఉపేంద్ర కూడా తరచుగా రీమేక్ సినిమాలు చేస్తుంటారు. సొంతంగా దర్శకత్వం చేస్తే కొత్త కథలు చేస్తాడు కానీ.. వేరే దర్శకులు రీమేక్ సబ్జెక్టులతో వస్తే అతనేమీ కాదనడు. ఆల్రెడీ 'గోపాల గోపాల" రీమేక్లో నటిస్తున్న ఉపేంద్ర.. తాజాగా ఓ తెలుగు బ్లాక్బస్టర్ ఓకే చేశాడు. అదే.. సోగ్గాడే చిన్నినాయనా.

సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ హిట్టయిన 'సోగ్గాడే.."ను ఉపేంద్ర కథానాయకుడిగా కన్నడంలో తీయబోతున్నారు. ఉపేంద్ర అయితేనే ఈ అల్లరి పాత్రలో రాణించగలడని 'సోగ్గాడే.." రీమేక్ ప్రపోజల్ అతడి దగ్గరికి వెళ్లింది. ఐతే 'సోగ్గాడే.." నేటివిటీ అనేది కీలకమైన ఫ్యాక్టర్. గోదావరి జిల్లాల ఫ్లేవర్ ఉట్టిపడుతూ ఉంటుంది. నాగార్జున కూడా ఆ పాత్రకు పర్ఫెక్ట్గా సూటయ్యాడు. ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆ పాత్రలో అంతగా రాణించలేరు అన్న ఫీలింగ్ కలిగించాడు. దీంతో ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్టయ్యారు. మరి కన్నడ ప్రేక్షకులకు ఈ రీమేక్ ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు