సంపూ సెన్సేషన్ అంటే సెన్సేషనే

సంపూ సెన్సేషన్ అంటే సెన్సేషనే

టాప్ లెవెల్లో సుల్తాన్ టీజర్.. రెండో స్థానంలో కపిల్ శర్మ షో.. ఆ రెండింటి తర్వాత 'కొబ్బరి మట్ట" టీజర్.. ఈ కాంబినేషన్కు ఏమైనా సంబంధం ఉందా..? కానీ ఇది నిజం. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్స్ బర్నింగ్ స్టార్ కొత్త సినిమా 'కొబ్బరి మట్ట" టీజర్ కూడా ఉండటం విశేషం. నిన్న ఓ దశలో సుల్తాన్ టజీర్.. కపిల్ షో వీడియోల తర్వాత కొబ్బరిమట్ట టీజర్ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా దీనికి టాప్-5లో స్థానం దక్కింది. 'కొబ్బరిమట్ట" టీజర్ ఇప్పటికే ఐదు లక్షల వ్యూస్ పూర్తి చేసుకోవడం విశేషం. 9 గంటల్లోనే లక్ష మార్కు దాటి.. రెండు రోజుల్లోనే 3 లక్షల మార్కును టచ్ చేసిన ఈ టీజర్.. మూడో రోజు ఐదు లక్షల హిట్స్ మైలు రాయిని కూడా దాటేసింది.

దీన్ని బట్టే మన బర్నింగ్ స్టార్కు ఏ లెవెల్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండున్నర నిమిషాల టీజర్లో దాదాపు ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న సంపూ డైలాగే హైలైట్. ఆడవాళ్ల కష్టాల గురించి సంపూ స్టయిల్లో చెప్పిన డైలాగ్ జనాల్ని బాగానే ఆకట్టుకుంటోంది. డైలాగ్ కొంచెం కామెడీగా ఉన్నా.. సంపూ మాత్రం చాలా సీరియస్గా బ్రీత్ లెస్ డైలాగ్ పలికి జనాల్ని ఆకట్టుకున్నాడు. 'హృదయకాలేయం" దర్శకుడు స్టీవెన్ శంకర్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహించాడు. ఇందులో సంపూ.. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు అనే మూడు విభిన్నమైన పాత్రలు పోషించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు