మహేష్ అతడికి నో చెప్పేశాడు

మహేష్ అతడికి నో చెప్పేశాడు

బ్రహ్మోత్సవం దెబ్బకు బెంబేలెత్తిపోయి ఉన్నాడు మహేష్ బాబు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఒక్క మురుగదాస్ సినిమా మీద మాత్రమే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్న మహేష్ బాబు.. మిగతా ప్రాజెక్టులన్నింటినీ పక్కనబెట్టేసినట్లే కనిపిస్తున్నాడు. పూరి జగన్నాథ్ తో అనుకున్న 'జనగణమన" నుంచి దాదాపుగా డ్రాప్ అయిపోయిన మహేష్.. తమిళ దర్శకుడు అట్లీకి కూడా నో చెప్పేసినట్లు సమాచారం. 'రాజా రాణి" లాంటి మంచి సినిమాతో అటు తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాడు అట్లీ.

రెండో సినిమాకే విజయ్ లాంటి స్టార్ హీరోతో పని చేసే ఛాన్స్ కొట్టేసిన అట్లీ.. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆశపడ్డాడు. 'తెరి" విడుదల ముందు వరకు మహేష్ కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నట్లు కనిపించాడు. 'తెరి" తెలుగు వెర్షన్ 'పోలీస్" ప్రమోషన్ల కోసం అట్లీ హైదరాబాద్ వచ్చినపుడు మహేష్ను మీట్ అయి.. ఓ లైన్ కూడా వినిపించాడట. ఐతే మహేష్కు ఆ కథ నచ్చలేదట. ఇంతలోనే 'పోలీస్" సినిమా రిజల్ట్ కూడా తెలిసిపోయింది. ఇంతకుముందు సరే చూద్దాం అన్నట్లు మాట్లాడిన మహేష్.. ఈ మధ్యే అట్లీకి స్పష్టంగా కుదరదని చెప్పేశాడట. దీంతో మళ్లీ విజయ్ హీరోగా తెరి-2 చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు అట్లీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English