అ..ఆ..లో ఆమె కూడా ఉంది త్రివిక్రమ్ గారు..

అ..ఆ..లో ఆమె కూడా ఉంది త్రివిక్రమ్ గారు..

అ..ఆ.. కేరాఫ్ సమంతగా మారిపోయింది. హీరో నితిన్ కంటే ఎక్కువగా ఆమెనే ఫోకస్ చేస్తున్నాడు త్రివిక్రమ్. కనీసం రిలీజ్ డేట్ పోస్టర్స్ లో అయినా నితిన్ కు కాస్త స్పేస్ ఇచ్చాడు మాటల మాంత్రికుడు. కానీ ఈ సినిమాలో సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె అనుపమ పరమేశ్వరన్. ఈ భామ చిన్న హీరోయిన్ ఏం కాదు.. మళయాలంలో స్టార్ హీరోయిన్. అ..ఆ..లో నటిస్తుంది అన్నపుడు చాలా మంది అనుపమ గురించి కూడా ఆసక్తిగా వేచి చూసారు. తీరా చూస్తుంటే సమంత డామినేషన్ ముందు అనుపమ అస్సలు కనిపించట్లేదు. ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ ఎక్కడా అనుపమ జాడే లేదు. ఏదో ట్రైలర్ లో ఓ పది సెకన్ల పాటు కనిపించడం మినహాయిస్తే ఇప్పటి వరకు ఈ భామను స్పెషల్ గా హైలైట్ చేసిన సందర్భమే లేదు.

ఇదంతా సినిమా ప్రమోషన్ లో భాగమా.. లేదంటే సినిమాలో ఆమె కారెక్టర్ ను సీక్రేట్ గా ఉంచాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడా తెలియదు గానీ అనుపమ పరమేశ్వరన్ ను మాత్రం చాలా దాచేస్తున్నాడు మాటల మాంత్రికుడు. అసలు ఈ సినిమాలో అలాంటి ఓ హీరోయిన్ ఉందనే విషయాన్ని కూడా ప్రేక్షకులు మరిచిపోయారు. అంతలా సమంతే కనిపిస్తుంది మరి. డ్యూయల్ హీరోయిన్ ఉన్న సినిమాను కాస్తా.. సమంత పుణ్యమా అని సింగిల్ హీరోయిన్ అయిపోయింది. మరి ప్రమోషన్ల వరకే అనుపమను తొక్కేసారా.. లేదంటే సినిమాలోనూ ఈ కేరళకుట్టిని ఇలాగే తొక్కేస్తారా..?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు