సంపూ బాబూ.. ఈ ఫాలోయింగ్ ఏంటి?

సంపూ బాబూ.. ఈ ఫాలోయింగ్ ఏంటి?తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్కో.. ఇంకేదైనా విశేషమో బయటికి వస్తే.. ఆ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో, ఫేస్‌బుక్‌లో కాసేపట్లోనే టాప్ ట్రెండింగ్‌లోకి రావడం మామూలే. కానీ చిన్న సినిమాల గురించి జనాలు పట్టించుకోవడం తక్కువ. ఐతే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాత్రం దీనికి మినహాయింపు. మామూలుగా అతను స్టారో కాదో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అతను కింగే అని చెప్పడానికి ‘కొబ్బరి మట్ట’ టీజర్ రుజువగా నిలుస్తోంది. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో ‘కొబ్బరి మట్ట’ టీజర్ రిలీజ్ చేశారు. అప్పుడు మొదలైంది ట్విట్టర్లో సంపూ బాబు హవా.

ఆ టీజర్ రావడం ఆలస్యం.. హైదరాబాద్ ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లోకి వచ్చేసింది. రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం అవుతున్నా.. దాని ప్లేస్ మారలేదు. 14-15 గంటలుగా ‘కొబ్బరి మట్ట’ హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లోనే కంటిన్యూ అవుతోంది. ఇక ఈ టీజర్‌కు కేవలం 9 గంటల్లోనే యూట్యూబ్‌లో లక్ష వ్యూస్ రావడం విశేషం. చిన్న సినిమాలకు సంబంధించి ఇది ఆల్ టైం రికార్డు అంటోంది ‘కొబ్బరి మట్ట’ యూనిట్. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి ‘కొబ్బరి మట్ట’ టీజర్ అదిరిపోయిందంతే. అందులో నిమిషానికి పైగా ఆపకుండా సంపూ చెప్పిన బ్రీత్ లెస్ డైలాగ్.. సోషల్ మీడియాలో ప్రకంపనలే రేపుతోంది. చూస్తుంటే ‘హృదయ కాలేయం’ లాగే ‘కొబ్బరి మట్ట’ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలాగే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English