సెక్స్‌ బాంబుకో దణ్ణం బాబూ

సెక్స్‌ బాంబుకో దణ్ణం బాబూ

సన్నీ లియోన్‌ వుంటే చాలు ఆ సినిమాని చూడ్డానికి జనం ఎగబడిపోతారనే భ్రమలకి ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టుకోవచ్చు. సినిమా, సినిమాకీ తగ్గిపోతూ వచ్చిన సన్నీ ప్రభావం ఇప్పుడు మరింత దిగజారింది. ఆమె తాజా చిత్రం 'వన్‌ నైట్‌ స్టాండ్‌'  బాక్సాఫీస్‌ వద్ద బాల్చీ తన్నేసింది. మొదటి వారంలో మూడు కోట్ల కంటే తక్కువ వసూళ్లు తెచ్చుకున్న ఈ చిత్రానికి రెండవ వారంలో కేవలం ఆరు లక్షల గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం తీసిన వారికి, కొన్న వారికి కూడా చేతులే కాక ఒళ్లంతా కాలిపోయింది. సన్నీ నటించిన సినిమాల్లో ఇది కాస్త మీనింగ్‌ఫుల్‌గా వుందంటూ విమర్శకులు దీనికి పాస్‌ మార్కులు వేసారు కానీ ఇప్పటికీ సన్నీ సినిమాలని థియేటర్లలో చూడ్డానికి జనం మొహం చాటేస్తున్నారు.

సెన్సార్‌ నిబంధనల కారణంగా సన్నీ లియోన్‌ గీత దాటలేకపోతోంది. మిగతా హీరోయిన్ల మాదిరిగానే పరిధుల్లో వుండి ఎక్స్‌పోజింగ్‌ చేస్తోంది. సన్నీ లియోన్‌ సినిమాలకి కూడా ఎక్స్‌పోజింగ్‌ కోసం ఏమి వెళ్తాంలే అని అనుకుంటున్నారో ఏమో తన చిత్రాలని పూర్తిగా పట్టించుకోవడం మానేసారు. ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకి సన్నీలియోన్‌కి అవకాశాలిచ్చే వాళ్లే వుండరు. ఇది ఇప్పటికే పసిగట్టిందో ఏమో సొంత నిర్మాణం చేస్తానంటూ సన్నీలియోన్‌ పావులు కదుపుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు