నయన్ గురించి రూమర్ కాదు.. నిజమే

నయన్ గురించి రూమర్ కాదు.. నిజమే

ఎంతైనా నయనతార నయనతారే. నా లైఫ్ నా ఇష్టం అంటూ సాగే ఆమె నడవడిక ఎవ్వరికీ అర్థం కాదు. శింబుతో గాఢమైన ప్రేమలో మునిగిపోవడం.. ఉన్నట్లుండి అతడికి షాకివ్వడం.. తర్వాత ప్రభుదేవాతో పెళ్లి దాకా వెళ్లడం.. ఉన్నట్లుండి తెగతెంపులు చేసుకోవడం.. మళ్లీ మాజీ ప్రేమికుడు శింబుతో సినిమా చేయడం.. ఇలా నయన్ ఏం చేసినా సంచలనమే. దర్శకుడిగా ఒకే ఒక్క సినిమా.. అది కూడా ఫ్లాప్ మూవీ తీసిన విఘ్నేష్ శివన్‌తో కొత్త ప్రేమకథ మొదలుపెట్టడం కూడా నయన్‌కే చెల్లింది. నయన్ హీరోయిన్‌గా అతను చేసిన ‘నానుమ్ రౌడీదా' పెద్ద హిట్టవడంతో ఇప్పుడు విఘ్నేష్ రేంజే వేరు అన్నట్లుంది పరిస్థితి.

విఘ్నేష్ కోసం చాలామంది ప్రొడ్యూసర్లు లైన్లో ఉంటే.. వెరైటీగా అతనేమో నయనతార నిర్మాణంలో సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే వీళ్లిద్దరి మధ్య కథాచర్చలు పూర్తయ్యాయి. ఓ సబ్జెక్ట్ ఫైనలైజ్ అయింది. శివ కార్తికేయన్ హీరోగా నయనతార హీరోయిన్‌గా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు విఘ్నేష్. ఇలా తన ప్రియుడి కోసం ఓ హీరోయిన్ సినిమా నిర్మించడం అన్నది అరుదైన విషయం. బహుశా సౌత్ ఇండియాలో ఇలా తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదేనేమో. ముందు ప్రియుడి దర్శకత్వంలో సినిమా నిర్మించబోతున్న నయన్.. అన్న వార్త చూసి రూమర్ అనుకున్నారు కానీ.. స్వయంగా విఘ్నేషే ఈ సినిమాను కన్ఫమ్ చేయడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు