అభిషేక్ ఐష్‌కు షాకిచ్చింది అదుక్కాదట

అభిషేక్ ఐష్‌కు షాకిచ్చింది అదుక్కాదట

రెండు రోజులుగా బాలీవుడ్లో ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ మధ్య విభేదాలు వచ్చాయా..? ఐశ్వర్యారాయ్‌ అభిషేక్‌ను హర్ట్ చేసిందా..? ఆమె పాపులారిటీ అభిషేక్ అసూయ చెందుతున్నాడా..? ఇలా రకరకాల చర్చలు నడుస్తున్నాయి అక్కడ. దీనికంతటికీ కారణం.. ఐష్ కొత్త సినిమా ‘సరబ్జిత్’ ప్రివ్యూ షో సందర్భంగా అభిషేక్ వింత ప్రవర్తనే.

ముంబయిలో ఈ ప్రివ్యూ షో కోసం ఐష్‌తో పాటు ఆమె భర్త అభిషేక్ బచ్చన్, మావయ్య అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యారు. అమితాబ్ విడిగా రాగా.. అభి-ఐష్ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని హాజరయ్యారు. ఐతే వచ్చినప్పటి నుంచి అభిషేక్ చాలా ముభావంగా కనిపించాడు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలకు పోజులివ్వమన్నా ఆసక్తి చూపించలేదు. ఓ దశలో ఐష్ అభిని బలవంతంగా తీసుకొచ్చి అతడితో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. ఐతే ఇలా ఫొటోలు తీస్తుండగానే అభిషేక్ ఉన్నట్లుండి ఐష్ చేయి విడిపించుకుని విసురుగా వెళ్లిపోయాడు. దీంతో ఐష్ షాకైన తీరు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం మొదలైంది. దీనిపై నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడవడంతో అభిషేక్ వైపు నుంచి మీడియాకు క్లారిటీ ఇవ్వక తప్పలేదు.

‘సరబ్జిత్’ ఐష్ సినిమా కాబట్టి.. అందులో తాను లేను కాబట్టి.. తాను ఫొటోలకు పోజులివ్వడం బాగోదన్న ఉద్దేశంతోనే అభిషేక్ అలా సైడైపోయాడట. అసలతను ఈ ప్రివ్యూ షోకు రావడానికే ఇష్టపడలేదట. అక్కడ తానో అన్ వాంటెడ్ పర్సన్ లాగా అనిపించి పక్కకు వెళ్లిపోయానని అభిషేక్ తర్వాత వివరణ ఇచ్చాడట. అంతకుమించి ఐష్‌తో తనకేమీ ఇబ్బందుల్లేవని మీడియా సంస్థలకు అభిషేక్ చెప్పినట్లు సమాచారం.