మంచు మనోజ్.. గుణపాఠం నేర్చుకున్నాడు

మంచు మనోజ్.. గుణపాఠం నేర్చుకున్నాడు

టాలీవుడ్లోకి కొత్తగా వచ్చే హీరోలు కెరీర్ ఆరంభంలో సేఫ్ సినిమాలు చేయడానికే ట్రై చేస్తారు. అనుభవజ్నులైన దర్శకులతో పని చేయడానికే మొగ్గు చూపిస్తారు. ఐతే మంచు మనోజ్ మాత్రం ఆరంభం నుంచి ఎక్కువగా ప్రయోగాలే చేస్తున్నాడు. యువ దర్శకులతోనే పని చేస్తూ వస్తున్నాడు. అతడి సినిమాలు కొన్ని ఆడాయి.. కొన్ని ఫెయిలయ్యాయి. ఐతే వైవిధ్యమైన కథాంశాలు ఎంచుకుంటాడని.. క్యారెక్టర్లలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడని పేరు మాత్రం వచ్చింది. ఐతే వరుసగా కొత్త దర్శకులతో పని చేసి మొహం మొత్తేసిందో ఏమో.. ఈ మధ్య సీనియర్లతో పని చేశాడు మనోజ్. కానీ గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. దశరథ్ తీసిన ‘శౌర్య’.. వర్మతో చేసిన ‘ఎటాక్’ మనోజ్ కెరీర్‌ను బాగా డ్యామేజ్ చేశాయి. మనోజ్‌కంటూ ఉన్న ఇమేజ్ కూడా దెబ్బ తింది.

ఈ నేపథ్యంలో మనోజ్ రూటు మారుస్తున్నట్లున్నాడు. ఇక మళ్లీ కొత్త దర్శకులతో తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు చేయాలని ఫిక్సయినట్లున్నాడు. నిన్న పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూడూ కూడా కొత్త దర్శకులతో చేయబోయేవే కావడం విశేషం. సాగర్ ప్రసన్న అనే డెబ్యూ డైరెక్టర్‌తో మనోజ్ చేస్తున్న ‘సీతామాలక్ష్మి’ ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. దీంతో పాటు మనోజ్.కె.సత్య అనే మరో కొత్త దర్శకుడితో ఓ సినిమా.. అజయ్ ఆండ్రూస్ అనే ఇంకో డెబ్యూ డైరెక్టర్‌తో ఓ సినిమా కమిటయ్యాడు మనోజ్. ఈ మూడు సినిమాలూ వైవిధ్యమైన కథలతోనే తెరకెక్కుతున్నాయని.. మనోజ్ మళ్లీ ఒకప్పట్లా కొత్త క్యారెక్టర్లు ట్రై చేస్తున్నాడని అంటున్నారు. మరి వీటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English