ఆ ముదురు మ‌న్మ‌థుడికి గోల్డెన్ టైమ్..

ఆ ముదురు మ‌న్మ‌థుడికి గోల్డెన్ టైమ్..

చాక్లెట్ బాయ్.. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు.. గ్రీకువీరుడు.. ఇలా ఎన్ని పేర్లుంటే అన్నీ అర‌వింద్ స్వామికి సెట్టైపోతాయి. 20 ఏళ్ల కింద అత‌డు అలా తెర‌పై న‌డిచొస్తుంటే ప‌డి చ‌చ్చిపోయే వాళ్లు అమ్మాయిలు. అంద‌గాడు అనే ప‌దానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేవాడు ఈ హీరో. కానీ ఎంత స్పీడ్ గా వ‌చ్చాడో అంతే స్పీడ్ గా ప‌డిపోయాడు అర‌వింద్ స్వామి. మూడేళ్ల కింద మ‌ణిర‌త్నం క‌డ‌ల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు ఈ హీరో. అది ఫ్లాప్ అయినా అర‌వింద్ స్వామికి బెస్ట్ రీ ఎంట్రీ ప్లాట్ ఫామ్ గా నిలిచింది క‌డ‌ల్.

ఇక గ‌తేడాది త‌నిఒరువ‌న్ సినిమాలో విల‌న్ గా న‌టించాడు ఈ హీరో. ఈ సినిమా అర‌వింద్ స్వామి కెరీర్ ను మార్చేసింది. హీరో జ‌యంర‌వి కంటే విలన్ అర‌వింద్ స్వామికే ఎక్కువ‌గా పేరు తీసుకొచ్చింది ఈ చిత్రం. అర‌వింద్ స్వామి న‌ట విశ్వ‌రూపం సినిమాకు బాగా హెల్ప్ అయింది. తెలుగు రీమేక్ లోనూ అర‌వింద్ స్వామినే విల‌న్ గా కొన‌సాగిస్తున్నారు.

దీపం ఉండ‌గానే ఇళ్లు చ‌క్క‌బెట్టుకోవాలి అన్న‌ట్లు డిమాండ్ ఉన్న‌పుడే కోట్లు కురిపించుకుంటున్నాడు ఈ న‌టుడు. త‌ని ఒరువ‌న్ తెలుగు రీమేక్ ధృవ‌లో న‌టించేందుకు అర‌వింద్ స్వామికి అక్ష‌రాలా 3 కోట్లు ఇచ్చార‌ని స‌మాచారం. ఓ విల‌న్ పాత్ర కోసం ఇంత‌గా ఖ‌ర్చు చేయ‌డం బ‌హుశా తెలుగు సినిమా చ‌రిత్రలోనే ఇదే తొలిసారి కావ‌చ్చు. ఇక బాలీవుడ్ లో డియ‌ర్ డాడ్ సినిమా కోసం కూడా దాదాపు 2 కోట్లు తీసుకున్నాడు అర‌వింద్ స్వామి. మొత్తానికి ఇమేజ్ ఉన్న‌పుడే క్యాష్ చేసుకుంటున్నాడు ఈ మాజీ హీరో. ఒక్కో సినిమా కోసం కో అనే మాటకు త‌గ్గ‌ట్లేదు ఈ ముదురు మ‌న్మ‌థుడు. అదృష్టం అంటే ఇదే కాదా మ‌రి..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు