ఇద్దరమ్మాయిలతో.. అదిరిందోచ్‌

ఇద్దరమ్మాయిలతో.. అదిరిందోచ్‌

అందరూ ఊహించిందే. కాని మన ఊహలకు అందకుండా దేవిశ్రీప్రసాద్‌ ఎక్కడికో తీసుకువెళ్లిపోయాడు. అవును, ఇద్దరమ్మాయిలతో సినిమా ఆడియో మామూలుగా లేదు. అదిరిపోయింది. ఒక కొత్త రకం థీమ్‌తో మరోసారి విజృంభించాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌. దర్శకుడు పూరి జగన్‌ చెప్పిన సిట్యుయేషన్స్‌ చాలా ఎక్సయిటింగ్‌ ఉండటంతో, కొత్త రకాల వాయిద్యాలతో ఈ సినిమాకు సంగీతాన్ని కంపోజ్‌ చేశాడట. 

బన్నీ ఎనర్జీకు మ్యాచయ్యే ట్యూన్స్‌, అతను స్టెప్పులు వెయ్యడానికి పనికొచ్చే బీట్స్‌ ఒక రేంజ్‌లో ఉన్నాయి. రన్‌ రన్‌ అంటూ సాగే ఫాస్ట్‌ బీట్‌ సాంగ్‌, వయోలిన్‌ థీమ్‌తో సాగో రొమాంటిక్‌ పాట, టాప్‌ లేసిపోద్ది అనే మాస్‌ బీటు యువతకు ఫస్ట్‌ టైమ్‌ వినగాననే పిచ్చిపిచ్చిగా నచ్చేస్తాయి. ఇక గణపతిబప్పా మోరియా అంటూ సాగే మీరో ఇంట్రో సాంగ్‌, బ్రహ్మితో చేసిన శంకరాభరణం ఆసక్తిగా ఉన్నాయి. విజువల్స్‌ కూడా ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్కివ్వడంతో ఇద్దరమ్మాయిలతో ఆడియో సూపర్‌ హిట్టనే టాక్‌ వినిపిస్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు