క‌న్న‌డ హాట్ హీరోయిన్‌కు రెండేళ్ల జైలు శిక్ష‌

క‌న్న‌డ హాట్ హీరోయిన్‌కు రెండేళ్ల జైలు శిక్ష‌

వెండితెర మీద హాట్ హాట్ అందాల‌తో క‌న్న‌డ యూత్‌కు పిచ్చెక్కించిన ఆ హాట్ హీరోయిన్ ఇప్పుడు జైళ్లో ఊచ‌లు లెక్క పెట్టు కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలో ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండే రోడ్లో ఆ హీరోయిన్‌ సెల్ ఫోన్ మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది. ఆమె కారు ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను తిట్ట‌డ‌మే కాకుండా కొట్టినందుకు గాను ఆమెపై కేసు బుక్ అయ్యింది. ఐదేళ్ల పాటు కేసును విచారించిన న్యాయ‌స్థానం ఎట్ట‌కేల‌కు తీర్పు ఖ‌రారు చేసింది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

 శాండ‌ల్‌వుడ్‌లో న‌టి మైత్రేయి గౌడ హాట్ హీరోయిన్‌గా కుర్రకారు గుండెల్లో ప్లేస్ కొట్టేసింది. 2011లో మైత్రేయితో పాటు ఆమె స్నేహితులైన సుప్రియ‌, రూపా, రేఖ‌లు క‌లిసి కారులో వ‌స్తున్నారు. ఈ కార్ డ్రైవ్ చేస్తోన్న‌ హీరోయిన్ మైత్రేయి సెల్ ఫోన్లో మాట్లాడుతోంది. కారు బ‌స‌వేశ్వ‌ర ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ లిమిట్స్‌లోకి రాగానే ఆ స్టేష‌న్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శివ‌కుమార్ కారును ఆపాడు. వెంట‌నే మైత్రేయితో పాటు ఆమె స్నేహితులు కారు దిగి శివ‌కుమార్‌ను దుర్భాష‌లాడారు. అంత‌టితో ఆగ‌కుండా అత‌డిపై చేయి చేసుకున్నారు.

 ఈ సంఘ‌ట‌న‌పై స‌ద‌రు కానిస్టేబుల్ బ‌స‌వేశ్వ‌ర ట్రాఫిక్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు పెట్టాడు. ఈ కేసును ఐదు సంవ‌త్స‌రాల పాటు విచారించిన బెంగ‌ళూరు మెజిస్ర్టేట్ కోర్టు శుక్ర‌వారం త‌న తుది తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధాన నిందితురాలైన మైత్రేయిగౌడ‌కు రెండేళ్లు, ఆమె స్నేహితురాళ్ల‌కు యేడాది చొప్పున శిక్ష ఖ‌రారు చేసింది. ఆ వెంటనే బెంగళూరు ఐదో ఏసీఎంఎం కోర్టు ఈ నలుగురికీ బెయిల్ మంజూరైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు