'అ ఆ'తో ఆడుకుంటున్నారుగా

'అ ఆ'తో ఆడుకుంటున్నారుగా

మూడే నెలల్లో ఒక చిన్న సినిమా చేద్దామని త్రివిక్రమ్‌ తలపెట్టిన 'అ ఆ' మొదలై ఎనిమిది నెలలైనా కానీ ఇంతవరకు విడుదల తేదీపై స్పష్టత రాలేదు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈ నెలలో అయినా విడుదల చేద్దామని చూస్తే బ్రహ్మోత్సవం అడ్డు పడింది. దీంతో జూన్‌కి వాయిదా పడిన 'అ ఆ' అప్పుడు కూడా రిలీజ్‌ అవడం డౌటే అనేది తాజా సమాచారం. జూన్‌లో సినిమా బిజినెస్‌ అంత ఆశాజనకంగా వుండకపోవచ్చుననే అనుమానాలు వుండడంతో అ ఆ జులైకి వాయిదా పడినా ఆశ్చర్యం లేదట.

అసలే ఓవర్‌ బడ్జెట్‌ అయిన ఈ చిత్రానికి ఇప్పుడు అదనంగా వడ్డీల రూపంలో నిర్మాతకి తడిసి మోపెడవుతోంది. నితిన్‌కి వున్న మార్కెట్‌కి డబుల్‌ పెట్టినప్పటికీ త్రివిక్రమ్‌ బ్రాండింగ్‌తో ఇది గట్టెక్కిపోతుందని అనుకుంటున్నారు. కానీ ఇలాగే వాయిదాలు పడుతూ పోతే, వడ్డీల రూపంలో పెరిగే భారాన్ని తిరిగి తెచ్చుకోవడం అంత తేలికేం కాకపోవచ్చు. మరోవైపు ఈ సినిమాపై ఆధారపడి వున్న ఇతర చిత్రాలు కూడా వెనక్కి పోతూ నిర్మాతని మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు