తెలుగు ప్రేక్షకులకు అన్యాయం

తెలుగు ప్రేక్షకులకు అన్యాయం

సమ్మర్ అంటే సినిమాలకు బంగారం లాంటి సీజన్. సంక్రాంతి.. దసరా.. కూడా దీనికి దిగదుడుపే. అన్ని వర్గాల ప్రేక్షకులూ థియేటర్లకు వరుస కట్టే సీజన్ ఇది. ఇలాంటి సీజన్‌ ను మన సినిమాలు సరిగా వాడుకోవట్లేదు. పరీక్షల సీజన్లో ఇబ్బడిముబ్బడిగా సినిమాలు వదిలేసిన తెలుగు నిర్మాతలు.. సమ్మర్ సీజన్‌ను మాత్రం వేస్ట్ చేసేస్తున్నారు. కలెక్షన్ల వర్షం కురిసే మే నెలలో తొలి వారం ఒక్క సినిమా  (సుప్రీమ్) మాత్రమే రిలీజైంది. రెండో వారం అయితే ఒక్క సినిమా కూడా లేదు. తర్వాతి వారం ‘బ్రహ్మోత్సవం’ లైన్లో ఉన్నప్పటికీ.. ఏదో ఒక చిన్న సినిమా అయినా రిలీజవుతుందేమో అని చూస్తే.. అలాంటిదేమీ జరగలేదు.

పోనీ ఏ సినిమా విడుదలకు సిద్ధంగా లేదా అంటే అదేమీ కాదు. ‘అ..ఆ’, ‘ఒక్క అమ్మాయి తప్ప’ లాంటి సినిమాలు ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాయి. కానీ ఏవీ కూడా విడుదలకు సాహసించలేదు. నిజానికి సమ్మర్ సీజన్లో ఒక్క వారం ఆడినా మంచి కలెక్షన్లే వస్తాయి. అయినప్పటికీ ఏ తెలుగు సినిమా కూడా ఈ వారం రిలీజవ్వలేదు. దీంతో ప్రేక్షకులకు పాత సినిమా, తమిళ డబ్బింగ్ మూవీసే దిక్కవుతున్నాయి. 24, సుప్రీమ్, సరైనోడు సినిమాలకే ఎక్కువ స్క్రీన్లను పంచారు. ఈ వారం విడుదల కాబోతున్న తమిళ డబ్బింగ్ సినిమాలు బిచ్చగాడు, పెన్సిల్ ఏదో నామమాత్రంగా విడుదలవుతున్నాయి. ఆ సినిమాల మీద ఎలాంటి హైప్ లేదు. 20న బ్రహ్మోత్సవం వస్తోంది కాబట్టి తర్వాతి వారం కూడా ఇంకే తెలుగు సినిమా రిలీజయ్యే పరిస్థితి లేదు. మొత్తానికి మే నెలలో కేవలం రెండు సినిమాలతో సరిపెట్టుకోవాలన్నమాట. ఇది తెలుగు ప్రేక్షకులకు అన్యాయమే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు