నాగార్జున మరీ ఇంత భయపడుతున్నాడేంటి?

నాగార్జున మరీ ఇంత భయపడుతున్నాడేంటి?

అక్కినేని అఖిల్‌ మొదటి సినిమా డిజాస్టర్‌ కావడంతో అక్కినేని నాగార్జున పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయాడు. రెండో సినిమా మిస్‌ఫైర్‌ అయితే అఖిల్‌ కెరియర్‌ ఇబ్బందుల్లో పడుతుంది. ఇప్పటికే హీరోలు ఎక్కువైపోయి, దర్శకులు తగ్గిపోయి చాలా మంది ఇక్కట్లు పడుతున్నారు. ఇలాంటి టైమ్‌లో ప్రతి సినిమాతోను హీరోలు తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం నెలకొంది. అందుకే రెండో సినిమాతో అయినా అఖిల్‌ హీరోగా నిలబడిపోవాలని నాగార్జున భావిస్తున్నారు. సెకండ్‌ అటెంప్ట్‌ తేడా జరగకుండా ఉండడం కోసం నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఊపిరి సినిమాని అంత అందంగా తీసిన వంశీ పైడిపల్లికి అఖిల్‌ రెండో సినిమాని డైరెక్ట్‌ చేసే అవకాశమిచ్చారు.

 అయితే వంశీ పైడిపల్లి చెప్పిన కథ నాగార్జునకి అంతగా నచ్చలేదట. అందుకని బాలీవుడ్‌ సినిమా 'యే జవానీ హై దీవానీ' రీమేక్‌ చేద్దామని అంటున్నాడట. తన గత చిత్రం రీమేక్‌ కనుక వెంటనే మరో రీమేక్‌ చేయకూడదని వంశీ పైడిపల్లి భావిస్తున్నాడట. తనని నమ్మమని, మంచి కథతో అఖిల్‌కి హిట్‌ ఇస్తానని అంటున్నా కానీ నాగార్జున ధైర్యం చేయలేకపోతున్నాడట. అవసరమైతే మరికొంత కాలం వేచి చూసి అయినా అఖిల్‌కి పక్కాగా వర్కవుట్‌ అయ్యే ప్రాజెక్టే సెట్‌ చేద్దామని అనుకుంటున్నారని, అంచేత వంశీ పైడిపల్లితో సినిమా అయితే ఇప్పటికి ఆగిపోయినట్టేనని ఫిలింనగర్‌ భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు