పవన్‌ చేతులారా వృధా చేసుకుంటున్నాడు

పవన్‌ చేతులారా వృధా చేసుకుంటున్నాడు

తెలుగు సినిమా మార్కెట్‌ ఇప్పుడు బాగా పెరిగింది. బాహుబలి తర్వాత మన సినిమా రేంజ్‌ కనీసం పది నుంచి ఇరవై కోట్ల వరకు పెరిగింది. ఇది కేవలం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ వరకే. ఇక పోస్ట్‌ రిలీజ్‌ అయితే ఇప్పుడు తెలుగు సినిమా సత్తా ఎంతనేది అంచనాకి కూడా అందడం లేదు. ఏ సినిమా అయినా కాస్త బాగుంటే, అందులో ఒక సూపర్‌స్టార్‌ వుంటే వంద కోట్ల షేర్‌ వచ్చి పడిపోతుంది. 'సరైనోడు' లాంటి సినిమాని ఆ స్థాయిలో చూస్తున్నారంటే ఇక నిజంగా విషయమున్న సినిమాలని ఏ స్థాయిలో ఆదరిస్తారని అనుకోవాలి? ఇలాంటి టైమ్‌ని వాడుకోవడంలో పవన్‌కళ్యాణ్‌ విఫలమయ్యాడు. ప్రేక్షకుల అభిరుచిని మరీ చీప్‌గా చూసి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' లాంటి అతి చెత్త ప్రోడక్ట్‌ వదిలాడు.

అక్కడికీ దానికి యాభై కోట్ల షేర్‌ వచ్చింది. నిజంగా ఈ సినిమా కనుక యావరేజ్‌గా అనిపించినా మరో యాభై కోట్లు ఈజీగా వచ్చి ఉండేవి. ఇప్పుడు బ్రహ్మూెత్సవం చిత్రానికి వంద కోట్ల షేర్‌ తక్కువ రాదని అంచనా వేస్తున్నారు. కనీసం తదుపరి చిత్రాన్ని అయినా క్రేజీగా ప్లాన్‌ చేయకుండా అవుట్‌డేటెడ్‌ అయిపోయిన ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఫామ్‌లో లేని ఎస్‌.జె. సూర్యతో పవన్‌ చేస్తున్నాడు. ఆ చిత్రం కనీసం యావరేజ్‌గా పాసైపోయినా చాలని పవన్‌ అభిమానులే భావిస్తున్నారంటే అతనెలాంటి చిత్రాల్ని రెడీ చేస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చునిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు