పవన్ మళ్లీ ఆమెపై కన్నేశాడు..

పవన్ మళ్లీ ఆమెపై కన్నేశాడు..

చిరంజీవి తరం సీనియర్ హీరోలకే కాదు.. నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన పవన్ కళ్యాణ్‌కు సైతం హీరోయిన్ల సమస్య ఉందిప్పుడు. తన ప్రతి సినిమాకూ హీరోయిన్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఒకసారి చేసిన హీరోయిన్‌తో ఇంకోసారి చేయకుండా.. సినిమా సినిమాకు హీరోయిన్లను మారుస్తూ.. అప్పుడప్పుడూ కొత్తవాళ్లను ట్రై చేస్తూ వస్తున్నాడు పవర్ స్టార్.

ఐతే ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేయబోయే తర్వాతి తన పక్కన ఇప్పటిదాకా నటించని ఫ్రెష్ ఫేస్ కోసం ట్రై చేశాడు కానీ.. కుదర్లేదు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లందరూ పవన్‌తో ఇప్పటికే నటించేశారు. మరీ కొత్తవాళ్లను ట్రై చేస్తే అనీషా ఆంబ్రోస్ విషయంలో అడ్డు పడ్డట్లు అభిమానులు అభ్యంతరాలు చెప్పే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఈసారికి ఓ పాత హీరోయిన్‌తోనే సర్దుకుపోదామని ఫిక్సయ్యాడట పవన్. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో గోల్డెన్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి హాసన్‌తో మరోసారి జతకట్టాలని అనుకుంటున్నాడట పవన్.

రెండు మూడు నెలల పాటు సాగించిన అనంతరం చివరికి శ్రుతికే ఓటు వేశారట పవన్-ఎస్.జె.సూర్య. రెండు వారాల కిందట లాంఛనంగా ఆరంభమైన ఈ సినిమా జూన్లో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఓ ఫ్యాక్షన్ లీడర్ ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇది తమిళ హిట్ మూవీ ‘వీరం’కు రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. పవన్ మిత్రుడు, సర్దార్ గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ శరత్ మరారే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు