సుక్కు-రామ్ చరణ్.. ఓ సై-ఫై థ్రిల్లర్

సుక్కు-రామ్ చరణ్.. ఓ సై-ఫై థ్రిల్లర్

కెరీర్లో చాలా వరకు రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేశాడు రామ్ చరణ్. ‘మగధీర’ను స్పెషల్ కేటగిరీలో వేసేస్తే.. చరణ్ ఏదో కొత్తగా ట్రై చేద్దామని చేసిన ఏకైక సినిమా ‘ఆరెంజ్’. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ అతను ప్రయోగాల జోలికి వెళ్లలేదు. వరుసగా రొటీన్ కమర్షియల్ సినిమాలకే పరిమితం అయిపోయాడు. ఐతే ఇన్నాళ్లూ చెల్లిపోయింది కానీ.. ఇకపైనా ఆ రొటీన్ సినిమాలంటే చాలా కష్టం. ఆల్రెడీ ‘బ్రూస్ లీ’తో ఆ సంగతి చెర్రీకి బాగానే అర్థమైంది. అందుకే కమర్షియల్ విలువలకు ఢోకా లేకుండానే కొత్తదనమూ ఉన్న తమిళ బ్లాక్‌బస్టర్ ‘తనీ ఒరువన్’ను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

చరణ్ దీని తర్వాత చేయబోయే సినిమా కూడా వైవిధ్యంగానే ఉండబోతోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో అత్యంత క్రియేటివ్ అని పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ‘నాన్నకు ప్రేమతో’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన సుకుమార్.. ఆ కాన్ఫిడెన్స్‌తో వరుసగా మూడో సినిమా కూడా థ్రిల్లర్ కథాంశంతోనే చేయబోతున్నాడు. రామ్ చరణ్‌కు ఓ మేకోవర్‌లాగా ఉండేలా అతడితో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట సుకుమార్. ఇప్పటిదాకా టాలీవుడ్లో ఎవ్వరూ టచ్ చేయని వైవిధ్యమైన కథాంశంతో సుక్కు ఓపిగ్గా స్క్రిప్టు తయారు చేసుకుంటున్నాడట. ‘తనీ ఒరువన్’ రీమేక్ నుంచి బయటికి రావడానికి చరణ్‌కు చాలా టైం ఉంది. ఇప్పటికే స్క్రిప్టు పనిలో పడ్డ సుక్కు ఇంకో మూడు నెలల టైం తీసుకుని పనంతా పూర్తి చేస్తాడట. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకునే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు