బాలీవుడ్ రా రమ్మంటోంది..!

బాలీవుడ్ రా రమ్మంటోంది..!

తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సుధీర్ బాబును మహేశ్ బావగానే చూస్తారు కానీ సొంత ఇమేజ్ అంటూ రాలేదు. ప్రేమ కథాచిత్రం తొలి సినిమా విడుదలవ్వడమేంటి అనుకుంటు న్నారా..? ఏం లేదు.. బాలీవుడ్ లో సుధీర్ బాబు నటించిన తొలి సినిమా బాఘీ విడుదలైం, భలే మంచి రోజు లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా.. స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం సుధీర్ బాబుకు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ బాఘీతో పరిచయమయ్యాడు సుధీర్. మన వర్షం సినిమాకు రీమేక్ ఇది. బాఘీలో సుధీర్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమాలో యాక్షన్ స్టంట్స్ అదరగొట్టాడు సుధీర్. టైగర్ ష్రాఫ్ కు పోటీగా మార్షల్ ఆర్ట్స్ లో దుమ్ము లేపేసాడు సుధీర్.

 పేరుకు తెలుగు నటుడే అయినా.. బాలీవుడ్ హీరోకు ఏ మాత్రం తగ్గని ఫిజిక్ సుధీర్ సొంతం అంటూ క్రిటిక్స్ మహేశ్ బావను పొగిడేసారు. పైగా సినిమాకు వసూళ్లు కూడా బాగా వస్తున్నాయి. సినిమా సూపర్ హిట్ కావడంతో సుధీర్ బాబు ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో సుధీర్ కావాలంటున్నారట. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తైనా.. ఇప్పటి వరకు ఇక్కడ సుధీర్ బాబుకు స్టార్ ఇమేజ్ రాలేదు. కానీ బాఘీ సినిమాతో ఉత్తరాదిన మాత్రం తొలి సినిమాతోనే మంచి ఇమేజ్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే హీరో కంటే ఎక్కువ మార్కులు సుధీర్ కే ఇచ్చారు. మరి ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుని సుధీర్ బాబు బాలీవుడ్ లో జెండా పాతేస్తాడా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు