అరవోళ్లు సూర్యను హర్ట్ చేశారా..

అరవోళ్లు సూర్యను హర్ట్ చేశారా..

సక్సెస్.. ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ.. సాహసోపేత సినిమాలు చేస్తూ సాగిపోతుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. గత మూణ్నాలుగేళ్లలో అతను చేసిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకున్నా.. ‘24’ లాంటి హై రిస్క్ ప్రాజెక్టు చేయడం.. సొంతంగా రూ.75 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అతడికే చెల్లింది. అతడి ప్రయత్నం వృథా ఏమీ కాలేదు. ‘24’కు గొప్ప సినిమాగా గుర్తింపు వచ్చింది. ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు. ఐతే ఈ సినిమాకు తెలుగులో వస్తున్నంత రెస్పాన్స్ తమిళంలో రాకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రిటిక్స్ రేటింగులు కానీ.. కలెక్షన్లు కానీ.. తెలుగుతో పోలిస్తే తమిళంలో తక్కువగా ఉన్నాయి.

తెలుగులో ‘24’ సినిమాకు చాలా మంచి రివ్యూలు వచ్చాయి. మంచి మంచి రేటింగులిచ్చారు. అందరూ సినిమా సూపర్బ్ అని పొగిడారు. ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. సోషల్ మీడియా అంతటా తెలుగు ప్రేక్షకులు సినిమాకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఐతే తమిళంలో మాత్రం సమీక్షకులు ఈ సినిమాకు ఏవరేజ్ రేటింగులిచ్చారు. నెగెటివ్ పాయింట్లనే ఎక్కువ హైలైట్ చేశారు. కొందరు ఇదొక సిల్లీ సినిమా అని.. హాలీవుడ్ సినిమాలకు కాపీ అని ప్రచారం సాగించారు.

తమిళంలో ప్రతి హీరోకూ ఫ్యాన్స్‌తో పాటు యాంటి ఫ్యాన్స్ కూడా ఎక్కువ. వాళ్లందరూ ‘24’ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలుపెట్టారు. ఐతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుంటే.. మన సినిమాను మనం కించపరుచుకోవడం ఏంటంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో ‘24’పై వ్యతిరేక ప్రచారం సాగిస్తున్న వారిపై.. విమర్శకులపై విరుచుకుపడుతోంది. కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం మీదా ఈ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సూర్య చేసిన గొప్ప ప్రయత్నానికి అండగా నిలుద్దాం అంటూ పిలుపునిస్తోంది. మరి చివరికి ‘24’ ఎక్కడ ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు