లారెన్స్ హీరోయిన్ ఎవరో తెలుసా..

లారెన్స్ హీరోయిన్ ఎవరో తెలుసా..

ఇంతకు ముందు రాఘవ లారెన్స్‌ ను లైట్ తీసుకునేవాళ్లు జనాలు. కొంచె పేరున్న హీరోయిన్లెవరూ అతడి పక్కన హీరోయిన్‌గా నటించడానికి ఒప్పుకునేవాళ్లు కాదు. ఐతే కాంచన, కాంచన-3 లాంటి హిట్లతో లారెన్స్ రేంజే మారిపోయింది. ఒకప్పుడు అతణ్ని చిన్న చూపు చూసినవాళ్లు ఇప్పుడు అతడి పక్కన నటించడానికి తహతహలాడుతున్నారు. ఏకంగా నయనతార లాంటి టాప్ హీరోయిన్ లారెన్స్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. ‘కాంచన’ సిరీస్‌లో భాగంగా లారెన్స్ తీయబోయే కొత్త సినిమాలో నయనతారే హీరోయిన్ అంటున్నారు.

ప్రస్తుతం ‘పటాస్’ రీమేక్ లో నటిస్తున్న లారెన్స్ దీని తర్వాత కాంచన సిరీస్ కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఈ సినిమాకు ముందు కాజల్ అగర్వాల్ ను కథానాయికగా అనుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకుని నయనతారను సంప్రదించాడు. ఇప్పటికే ‘మాయ’ అనే ఫక్తు హార్రర్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసిన నయన్.. మరోసారి హార్రర్ కామెడీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. ఓవైపు బాలకృష్ణ లాంటి బడా హీరో సినిమాకు నో అనేసిన నయన్.. లారెన్స్ కు మాత్రం ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘కాంచన’ సిరీస్ కొత్త సినిమాను రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడట లారెన్స్. దీని తెలుగు వెర్షన్ హక్కుల్ని బండ్ల గణేష్ రూ.25 కోట్లకు కొన్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు